TS : హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి… షోకాజ్ నోటిసుపై ఏమంటారో..?
- By hashtagu Published Date - 10:29 AM, Wed - 2 November 22
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ముగిసిన మరుసటి రోజే ఆయన హైదరాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటిసుకు వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు రాహుల్ యాత్ర కొనసాగుతోది. ఈ యాత్రలో కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి పాల్గొంటారా లేదా? ఇది కూడా సస్పెన్స్ గానే ఉంది. అయితే తనపై వచ్చిన అభియోగాలపై క్లిన్ చీట్ ఇచ్చేంతవరకు ఇంట్లో నుంచి బయటకు రానని ఎవరినీ కలవనని వెంటక్ రెడ్డి అంటున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.
గతనెల అక్టోబర్ 21న వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు. మునుగోడులో ఉపఎన్నిక ప్రచారానికి ఆయన దూరంగానే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి హైదరాబాద్ చేరుకున్న వెంకట్ రెడ్డి తర్వాత ఏం చేయబోతున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.