Motkupalli Narasimhulu : కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు హస్తం తీర్థం పుచ్చుకున్నారు
- By Sudheer Published Date - 12:43 PM, Fri - 27 October 23

అంత భావించినట్లే సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ పార్టీ లోకి వలసల పర్వం ఎక్కువవుతుంది. గతంలో కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలో చేరిన నేతలంతా మళ్లీ సొంత గూటికే చేరుతున్నారు. అలాగే బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కూడా కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకుంటున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
మోత్కుపల్లి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత (Akula Lalitha), ఏనుగు రవీందర్ రెడ్డి (Enugu Ravinder Reddy), శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కరీంనగర్ బీర్ఎస్ నేత సంతోష్ కుమార్‌లు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. వీరందరికీ ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. ఇలా పదుల సంఖ్యలో కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతుండడం తో పార్టీ లోనే కాదు కార్య కర్తల్లోను జోష్ పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవ్వరు ఆపలేరంటూ వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేదు. కొన్నేళ్ల క్రితం బీఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి.. తనకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. అయితే మోత్కుపల్లి విజ్ఞప్తిని కేసీఆర్ పట్టించుకోలేదు. అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ..ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం మోత్కుపల్లి తుంగతుర్తి టికెట్ తనకు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. గతంలో ఆయన తుంగతుర్తి నుంచే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కాకపోతే ఇప్పుడు ఈ సీటు కోసం కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్ సహా అనేక మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సింహులుకు కాంగ్రెస్ తరపున తుంగతుర్తి నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందా ? లేక ఏదైనా నామినేటేడ్ పదవిపై ఆయనకు కాంగ్రెస్ హామీ ఇస్తుందా ? అన్నది చూడాలి.
Read Also : Ambati Rambabu : ఖమ్మంలో అంబటి రాంబాబుకు చుక్కలు చూపించిన టీడీపీ – జనసేన కార్య కర్తలు