HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Kavitha Employees Are Not Kcrs Stooges But Relatives

MLC Kavitha: ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదు, ఆత్మబంధువులు!

టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఒక తల్లికి, బిడ్డకు ఉన్న పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత (Kavitha) తెలిపారు.

  • Author : Balu J Date : 07-01-2023 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

హైదరాబాద్: టీఎన్జీవో తో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్ గారికి ఒక తల్లికి, బిడ్డకు ఉన్న పేగు బంధం ఉందని ఎమ్మెల్సీ కవిత (Kavitha) తెలిపారు. నాంపల్లి లోని టీఎన్జీవో హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో విజయవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండటానికి ఉద్యోగులే ప్రధాన కారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ ఉపాధ్యాయులు పడే శ్రమ ఫలితంగానే భారతదేశ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందుతుందని, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ఉద్యోగులపై పూర్తి నమ్మకముందని సీఎం కేసీఆర్ అనేక సార్లు తెలిపారని, ప్రభుత్వ ఆలోచన విధానాలను ప్రజలకు చేరవేసి అమలు చేస్తారని తెలపారన్న ఎమ్మెల్సీ కవిత, భారత దేశంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు.

కేసీఆర్ కిట్, భూ సంస్కరణలు లాంటి అనేక కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయంటే దానికి కారణం ఉద్యోగులే అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. భారతదేశంలో ఏ అవార్డులు వచ్చినా, తెలంగాణకే మొదటి మూడు అవార్డులు వస్తున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, దీనికి కేసీఆర్ గారి ఆలోచనతో పాటు, ఉద్యోగుల కష్టం కూడా ముఖ్యమన్నారు. వ్యవసాయ శాఖలో 15 వేల మంది కొత్త ఉద్యోగులు, ఇంజనీరింగ్ విభాగంలొ 10వేల మంది కొత్త ఉద్యొగులు, ఇంకా ఇతర శాఖల్లో కొత్త ఉద్యోగాలను నియమించి అన్ని శాఖలను బలోపేతం చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శాశ్వత ఉద్యోగులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడంతొ పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత ఉద్యోగుల ఫిట్ మెంట్ ను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమని ఎమ్మీల్సీ కవిత తెలిపారు.

ఉద్యోగులు కేసీఆర్ గారి తొత్తులు అన్న బండి సంజయ్ విమర్శలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఉద్యోగులు కేసీఆర్ గారి తొత్తులు కాదని, ఆత్మబందువులని స్పష్టం చేసారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా,బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కానీ తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల భర్తీని సైతం బండి సంజయ్ తప్పు పడుతూ, యువకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ మీద చర్చ జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి, బీహెచ్ ఈఎల్ లాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేష్‌, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్ద్దీన్‌, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేనీ, టీఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • kavitha kalvakunta
  • telangana politics

Related News

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd