MLA Paidi Rakesh Reddy : రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది – ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
- By Sudheer Published Date - 06:16 PM, Mon - 25 December 23

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి అహంకారం తలకెక్కిందంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) హాట్ కామెంట్స్ చేసారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాకేష్..మీడియా తో మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు.. సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఇద్దరం సమానమే, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి.. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్లు సీఎం మాట్లాడుతున్నారు.. ఓడిపోయిన వారు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం ఎలా చెబుతారు? అంటూ పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
మా ఆత్మ గౌరవం తగ్గిస్తే మీ ఆత్మ గౌరవం కూడా తగ్గిస్తామంటూ హెచ్చరించారు. ఆర్మూర్ లో ఓడిన అభ్యర్థి వినయ్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.. ప్రజ స్వామ్యంగా వినయ్ రెడ్డి రాజకీయం చేయాలి లేకుంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని ఎమ్మె్ల్యే వార్నింగ్ ఇచ్చారు.
Read Also : TDP vs YSRCP : టీడీపీ – వైసీపీ మధ్య ‘డంకీ’ వార్