BRS Rebel MLA: హస్తం గూటికి BRS రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి
బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు.
- By Praveen Aluthuru Published Date - 01:39 PM, Mon - 25 September 23

BRS Rebel MLA: తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రంలో బలం కోల్పోతుంది. ఇప్పటికే జిల్లా స్థాయి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. మొన్నటికి మొన్న కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు నేతలు కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. గతంలో పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన తుమ్మల ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ఎమ్మల్యేలు సైతం టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారు. తాజాగా బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరనున్నట్టు ప్రకటించాడు.
బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహతో సహా కాంగ్రెస్ అగ్ర నేతలతో మైనంపల్లి తన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం లోపు అంటే రెండ్రోల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటానని తెలిపారు.BRS Rebel MLA:
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హనుమంతరావు కుమారుడికి టిక్కెట్టు ఇచ్చే విషయంలో అధికార పార్టీని ఆయన విభేదించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు.అలాగే పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించాడు. అధికార దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీఆర్‌ఎస్ కీలుబొమ్మగా మారిందని హనుమంతరావు ఆరోపించారు.తన కుమారుడికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి అగ్ర నాయకత్వం నిరాకరించడంతో ఆయన బీఆర్‌ఎస్ నుంచి వైదొలిగినట్లు సుస్పష్టం.
Also Read: Delhi Liquor Sam : BRS ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయబోతున్నారా..?