Station Ghanpur: రాజయ్య ఇంటికి వినయ్ భాస్కర్..
స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడంతో రాజయ్య పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది
- Author : Praveen Aluthuru
Date : 05-09-2023 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
Station Ghanpur: స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యకు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడంతో రాజయ్య పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయన త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నటు పరిణామాలు చెప్తున్నాయి. రాజయ్యను కాదని కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కేటాయించడం అక్కడి రాజకీయాలు సర్వత్రా ఆసక్తిగా మారాయి. నిజానికి స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యకు భారీ మద్దతు ఉంది. ఈ మధ్య ఆయన మీద ఏవేవో ఆరోపణలు వచ్చినప్పటికీ అనుచరవర్గం చీలిపోలేదు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేస్తున్నారు. దీంతో రాజయ్యను కాపాడుకునే పనిలో అధికార పార్టీ బుజ్జగింపులు కార్యక్రమం పెట్టుకుంది. అందులో భాగంగా ఈ రోజు వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తాటికొండ రాజయ్యను కలిస్తారు. పరిస్థితుల్ని వివరించే ప్రయత్నం చేశారు.
అంతకుముందు కేసీఆర్ తన దూతగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్డిని తాటికొండ రాజయ్య వద్దకు పంపారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజయ్య కలవలేదు. ఇంటికి వెళ్లిన అతను తిరిగివెళ్ళిపోయాడు. రాజయ్య ఇంటికి పల్లా వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో చేసేదేం లేక వెళ్లిపోయారు. అయితే రాజయ్య అనుచరవర్గంతో పల్లా మాట్లాడుతూ.. రాజయ్యకు మంచి పదవిని సీఎం కేసీఆర్ కేటాయిస్తారని హామీ ఇచ్చారు.
నిన్న సోమవారం కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో తాటికొండ రాజయ్య సమావేశం అయ్యారు. దీంతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈ భేటీ మర్యాద పూర్వకంగానే జరిగినట్టు రాజయ్య అనుచరులు చెప్పుకొచ్చారు. అయితే రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకే దామోదరను కలిసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తాటికొండ రాజయ్యతో భేటీ అవ్వడానికి అదే కారణమని అర్ధం అవుతుంది.
Also Read: Mahesh Vitta Marriage : గ్రాండ్ గా మహేష్ విట్టా మ్యారేజ్.. లవ్ లో సక్సెస్ !