Mahesh Vitta Marriage : గ్రాండ్ గా మహేష్ విట్టా మ్యారేజ్.. లవ్ లో సక్సెస్ !
Mahesh Vitta Marriage : మహేష్ విట్టా మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. బిగ్ బాస్ తో ఎంతో ఫేమస్ అయిన ఈ కమెడియన్ ఓ ఇంటివాడయ్యాడు.
- By Pasha Published Date - 02:04 PM, Tue - 5 September 23
Mahesh Vitta Marriage : మహేష్ విట్టా మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. బిగ్ బాస్ తో ఎంతో ఫేమస్ అయిన ఈ కమెడియన్ ఓ ఇంటివాడయ్యాడు. ఐటీ ఉద్యోగి శ్రావణి రెడ్డిని గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్న మహేష్ విట్టా శనివారం నాడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆమెను పెళ్లాడాడు. ఇవాళ ఉదయమే తన మ్యారేజ్ ఫొటోలను విట్టా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సీమ యాసతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన మహేష్ .. ఫన్ బకెట్ వీడియోలతో మంచిపేరు తెచ్చుకున్నాడు. అదే క్రేజ్‌తో బిగ్ బాస్‌లో రెండుసార్లు పాల్గొన్నాడు.
Also read : INDIA Name Change : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే యోచనలో కేంద్రం
బిగ్ బాస్ 3 సీజన్ లో ఒకసారి, ఓటీటీ కంటెస్టెంట్‌గా మరోసారి అతడు హౌస్‌లోకి వెళ్లొచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే.. తన లవ్ స్టోరీ గురించి మహేష్ విట్టా చెప్పాడు. ఆగష్టు, సెప్టెంబర్‌లలో పెళ్లి ఉండొచ్చని అప్పట్లో చెప్పిన మహేష్.. ఆ విధంగానే సెప్టెంబర్ మొదటి వారంలో పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా చెల్లెలి ఫ్రెండే ఈ శ్రావణి రెడ్డి. సినిమాల పరంగా చూస్తే.. కొండపొలం, జాంబీ రెడ్డి, ఇందువదన, A1 ఎక్స్ ప్రెస్ వంటి అనేక మూవీస్ లో విట్టా (Mahesh Vitta Marriage) నటించాడు. ప్రస్తుతం తను హీరోగా ఓ సినిమాలో నటించాడు. అది విడుదలకు రెడీగా ఉంది.