CM KCR: కేసీఆర్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్, పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకావిష్కరణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై అనేక వదంతులు వచ్చిన విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 12:16 PM, Fri - 13 October 23

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై అనేక వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై అనుమానం ఉందని ప్రతిపక్షాలు సైతం గగ్గొలు పెట్టాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ క్షేమంగా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ కలవడంతో ఆయనక్షేమంగా ఉన్నట్టు ఫొటోలో చూడొచ్చు. రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా రూపొందించి ముద్రించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని చూసి సీఎం హర్షం వ్యక్తం చేశారు. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి సాధికారిక సమాచారంతో శ్రీనివాస్ గౌడ్ పుస్తకాన్ని రూపొందించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా సమిష్టి కృషి కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.
Also Read: Venkaiah Naidu : ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు