Minister Sridhar Babu Vs KTR : కేటీఆర్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Minister Sridhar Babu Vs KTR : ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని..
- Author : Sudheer
Date : 15-09-2024 - 7:04 IST
Published By : Hashtagu Telugu Desk
Minister Sridhar Babu Vs KTR : ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu ) కౌంటర్ ఇచ్చారు. గత నాల్గు రోజులుగా తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఫై పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. అంతే కాదు అరెకపూడి గాంధీ ఏకంగా..కౌశిక్ ఇంటికి వెళ్లి సవాళ్లు చేయడం జరిగింది. రెండు రోజుల పాటు ఈ వ్యవహారం రచ్చ లేపింది. దీనిపై ఇరు పార్టీలు కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. నిన్న కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించి..కాంగ్రెస్ ఫై పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ కు ఏం సంబంధమన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు.
అతి తెలివి మంత్రి గారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని..బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేశారు. మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చినట్టు మేము తలదూర్చమని చురకలేశారు. ముందు మీరు మీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు చక్కదిద్దుకోండని సూచించారు.
కాంగ్రెస్ పార్టీపై నేపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని , ఎవరు తెలివిగలవారో ప్రజలే చెబుతారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేనని, వాళ్లందరినీ గౌరవిస్తామని అన్నారు. తాము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నగర్ బ్రాండ్ ఇమేజ్‌ని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Shyamala : అప్పుడే దూకుడు పెంచిన శ్యామల..చంద్రబాబు పై ఫైర్