Sitakka Legal Notices : కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
మాఫియా వెనుక సీతక్క ఉన్నారని , లెక్కబెట్టలేని ఇసుక లారీలు అక్రమ దందా చేస్తున్నాయని ఈ అక్రమ దందా వెనుక సీతక్క ఉందంటూ వీడియోలతో పెట్టారు
- Author : Sudheer
Date : 05-07-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka ) లీగల్ నోటీసులు (Legal Notices) పంపించారు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఫై దుష్ప్రచారం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఇందిరమ్మరాజ్యం ఇసుకరాళ్ళ రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సీతక్క పేర్కొన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఈ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షేమపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు సీతక్క ఫై బిఆర్ఎస్ చేసిన పోస్ట్ చూస్తే..
మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఆ మాఫియా వెనుక సీతక్క ఉన్నారని , లెక్కబెట్టలేని ఇసుక లారీలు అక్రమ దందా చేస్తున్నాయని ఈ అక్రమ దందా వెనుక సీతక్క ఉందంటూ వీడియోలతో పెట్టారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామం దగ్గర పట్టపగలే లారీల్లో ఇసుక తరలింపు జరుగుతుందని, ఇంతా జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఇసుక మాఫియా వెనుక సీతక్క ఉన్నారంటూ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఫై సీతక్క కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు జారీ చేసారు.
Read Also : Heavy Rain in Hyd : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం