HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponnam Prabhakar About Juvvada Farm House Party Issue

Juvvada Farm House Party : జన్వాడ ఫామ్ సోదాలు సీఎం కు సంబంధాలు లేవు -మంత్రి పొన్నం

minister ponnam prabhakar : ఫిర్యాదు వస్తేనే పోలీసులు సోదాలు చేశారని , కావాలనే కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు

  • Author : Sudheer Date : 27-10-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Poonam Juvvada Far
Minister Poonam Juvvada Far

జన్వాడ ఫామ్ హౌస్లో సోదాలు చేయాలని సీఎం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసారు. తాము ఎవ్వరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదని , బుకాయిస్తే తప్పు ఒప్పు కాదన్నారు. ఫిర్యాదు వస్తేనే పోలీసులు సోదాలు చేశారని , కావాలనే కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్దోషులు అయితే చట్టరీత్యా క్లియరెన్స్ తెచ్చుకోవాలన్నారు.

జన్వాడ రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ఫాంహౌస్‌లో స్పెషల్ పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు జరిపారు. భారీ శబ్ధాలతో పార్టీ జరుగుతుండగా, భారీ ఎత్తున ఫారిన్ మద్యం బాటిళ్లను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ జరుగుతుండడంతో డ్రగ్స్ అనుమానాలు కలిగాయి. దీంతో పోలీసులు అక్కడున్న వారికి పరీక్షలు జరిపారు. ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు, సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పేర్కొన్నారు.

ఇక ఈ పార్టీ పై కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. ‘అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) , పిల్లలు , బంధువులు ఇలా అంత ఉన్నారు. దావత్ చేసుకోవద్దా..? దావత్ చేసుకునేది కూడా ప్రభుత్వాన్ని అడిగి చేసుకోవాలా..? రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కుట్రలతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు..ఇలాంటి చిల్లర ప్రయత్నాలు, కేసులకు తాము భయపడేరకం కాదు. ప్రజల్లో తమపై ఓ దుష్ప్రచారం చేసే భాగంగానే రేవ్ పార్టీ(Rave party) అని ప్రచారం చేసింది. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) చెప్పారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు.

అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి ఫస్ట్.. టెస్టు చేస్తే 12 మందికి నెగిటివ్, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది..ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో కనుకోండి.. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాయడం ఎంత వరకు కరెక్ట్. మీము పబ్లిక్ లో ఉన్నామని చెప్పి..ఏది పడితే అది రాసేసి..ఏది పడితే అది అనేస్తే చెల్లుతుందా..? తాను అక్కడే ఉన్నానని..పోలీసులు వచ్చే 5 నిమిషాల ముందు అక్కడి నుండి వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్ దగ్గర ఉన్న..అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చి , భోజనం చేసి , కాసేపు టీవీ చూసి..కూతురి తో మాట్లాడి పండుకున్నానని ఉదయం లేచేసరికి ఈ వార్తలు చూసి షాక్ అయ్యాయని తెలిపాడు.

Read Also : Janwada Farm House Party : డీజీపీకి కేసీఆర్ ఫోన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • juvvada farm house party
  • ktr
  • minister ponnam prabhakar

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd