Janwada Farm House Party : డీజీపీకి కేసీఆర్ ఫోన్
Janwada Farm House Party : "ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల మరియు శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా చేస్తారని ?" ఆయన ప్రశ్నించారు. సోదాలు వెంటనే నిలిపేయాలని డీజీపీని కోరారు
- By Sudheer Published Date - 10:18 PM, Sun - 27 October 24

జన్వాడ ఫాంహౌస్ (Janwada Farmhouse) ఘటనపై బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR)స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి, ఆయన డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender)కు ఫోన్ చేసి అనేక ప్రశ్నలు సంధించారు. “ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల మరియు శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా చేస్తారని ?” ఆయన ప్రశ్నించారు. సోదాలు వెంటనే నిలిపేయాలని డీజీపీని కోరారు. తద్వారా ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రమైన విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోపక్క ఈ వ్యవహారం పై కేటీఆర్ (KTR) మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. ‘అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) , పిల్లలు , బంధువులు ఇలా అంత ఉన్నారు. దావత్ చేసుకోవద్దా..? దావత్ చేసుకునేది కూడా ప్రభుత్వాన్ని అడిగి చేసుకోవాలా..? రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కుట్రలతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు..ఇలాంటి చిల్లర ప్రయత్నాలు, కేసులకు తాము భయపడేరకం కాదు. ప్రజల్లో తమపై ఓ దుష్ప్రచారం చేసే భాగంగానే రేవ్ పార్టీ(Rave party) అని ప్రచారం చేసింది. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) చెప్పారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు.

Ktrpm2
అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి ఫస్ట్.. టెస్టు చేస్తే 12 మందికి నెగిటివ్, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది..ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో కనుకోండి.. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాయడం ఎంత వరకు కరెక్ట్. మీము పబ్లిక్ లో ఉన్నామని చెప్పి..ఏది పడితే అది రాసేసి..ఏది పడితే అది అనేస్తే చెల్లుతుందా..? తాను అక్కడే ఉన్నానని..పోలీసులు వచ్చే 5 నిమిషాల ముందు అక్కడి నుండి వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్ దగ్గర ఉన్న..అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చి , భోజనం చేసి , కాసేపు టీవీ చూసి..కూతురి తో మాట్లాడి పండుకున్నానని ఉదయం లేచేసరికి ఈ వార్తలు చూసి షాక్ అయ్యాయని తెలిపాడు.

Ktrpm
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గాలికొదిలారు. అన్ని అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం చేస్తూనే ఉంటాం. అనవసరంగా తమ జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం. చావును కూడా లెక్కచేయం అని కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also :AP Govt: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు