KTR America Tour: మేనల్లుడిని కలిసి మామ.!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
- By Hashtag U Published Date - 11:53 AM, Thu - 31 March 22

తెలంగాణ మంత్రి కేటీఆర్ 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు భారీగా పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా ఈ టూర్ సాగింది. 12రోజుల పర్యటన అనంతరం బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 18న అమెరికా వెళ్లిన కేటీఆర్ అండ్ టీం…అక్కడ పలు కంపెనీల సీఈవోలతో చర్చలు జరిపారు. తెలంగాణలో 8వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఇక కేటీఆర్ అమెరికా వ్యాపార పర్యటనలో తన మేనల్లుడిని కలుసుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న తపనతో పలు వ్యాపార సమావేశాలతో బిజీబిజీగా ఉన్న సమయంలో గ్యాప్ దొరకగానే…తన మేనల్లుడితో సరదా గడిపారు కేటీఆర్. కేటీఆర్ తన అమెరికా పర్యటన మధ్యలో ఉండగా అమెరికాలో చదువుతున్న తన మేనల్లుడు ఆదిత్య ( కవిత కుమారుడు)ను కలిసేందుకు సమయం కేటాయించారు. మేనల్లుడితో కేటీఆర్ తీసుకున్న ఫోటోను కవిత సోషల్ మీడియాతో పంచుకుంది. బిజీ షెడ్యూల్ ఉన్నాకూడా..తన క్యాంపస్ లో ఆదిత్యను కలిసారు ప్రియమైన మామయ్యతో నా కొడుకు. అంటూ కవిత ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఈ పిక్ లో కేటీఆర్ ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు. తన మేనల్లుడితో ఫోటోకు పోజులిచ్చేటప్పుడు క్యాజువల్ లుక్ లో మోడ్రన్ లుక్ లో కనిపించారు కేటీఆర్ . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతోంది.