HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Minister Harish Rao Surprise Inspection At Armoor Hospital

Harish Rao: ఆర్మూర్ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ

తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన చేశారు.

  • By Balu J Updated On - 02:23 PM, Tue - 6 December 22
Harish Rao: ఆర్మూర్ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) మంగళవారం ఆర్మూర్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి పనుల గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో మంత్రి మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటలా భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను వాకబు చేశారు. రోగులకు తగినటువంటి పోషికాహారం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో ఫార్మసీ లాబ్ సౌకర్యాలు గురించి తెలుసుకున్న మంత్రి హై ఎండ్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఉన్నప్పటికీ టిఫా(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌) స్కానింగ్ మెషిన్ అందుబాటులో లేదని చెప్పగా వెంటనే టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా కిడ్నీ సంబంధిత పేషెంట్లు డయాలసిస్ సౌకర్యం లేనందువలన నిజామాబాద్‌కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలనే చేయాలని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు. మంత్రి వెంట పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, వైద్య , ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ అయిన తరువాత తొలిసారి సందర్శనకు వచ్చిన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ప్రతీ వార్డుకెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

మీపట్ల డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటున్నదని మంత్రి అడగగా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని పలువురు రోగులు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు (Harish Rao) డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష చేసి ఆసుపత్రికి కావాల్సిన తక్షణ సౌకర్యాల పై చర్చించారు. ఆర్మూర్ దవాఖాన నిర్వహణ అద్భుతంగా ఉందని మంత్రి కితాబు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవ వల్లే ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయ్యిందన్నారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఆసుపత్రికే తొలి ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొంటూ ఫలితంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యాధునిక వైద్యం గ్రామగ్రామానికి చేరువైందన్నారు.

ఆర్మూర్ ఆసుపత్రిలో (Hospital) మందుల కొరత లేదని, బయట ప్రయివేట్ దుకాణాలకెళ్లి మందులు కొనాల్సిన పరిస్థితి లేదని ఆయన చెప్పారు.అతి త్వరలో ఈ ఆసుపత్రిలో కేడర్ స్ట్రెన్త్ పెంచుతామని అన్ని విభాగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను దృష్టిలో పెట్టుకొని ఈ ఆసుపత్రిలో మరిన్ని అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెంచుతామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సకల వసతులు కల్పిస్తామని హరీష్ రావు (Harish Rao) ప్రకటించారు.

ఆర్మూర్ ఆసుపత్రిలో ఉచిత ప్రసవాలు మరింత ప్రోత్సహించాలని మంత్రి వైద్య శాఖ అధికారులను,సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే 22,670 ఉచిత ప్రసవాలు జరగడం అభినందనీయమన్నారు. ఒక్క నవంబర్ లోనే 310 డెలివరీలు జరిగి ఆ తల్లుల కుటుంబాలకు దాదాపు ఒక కోటిన్నర రూపాయలు ఆదా కావడం హర్షణీయమని మంత్రి ప్రశంసించారు. ఇక నుంచి నెలకు 5 వందల ఫ్రీ డెలివరీలు జరిగేలా కృషి చేయాలని మంత్రి టార్గెట్ విధించారు.

తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ దవాఖానాలను తలదన్నేల ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి హరీష్ రావు (Harish Rao) ఉద్ఘాటించారు. కాగా ఆసుపత్రిలో పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఆర్మూర్ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జీ గౌడ్, సీనియర్ నాయకులు డా.మధుశేఖర్, మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినితా పవన్, వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, డాక్టర్లు నాగరాజు, అమృత్ రెడ్డి, స్రవంతిలతో పాటు ఆసుపత్రి సిబ్బంది, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు,ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపిటీసి లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : Modi Call to Sharmila: షర్మిల కు మోడీ ఫోన్.. ఢిల్లీకి పిలుపు!

Telegram Channel

Tags  

  • armoor
  • harish rao
  • Health Minister
  • hospital

Related News

Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!

Harish Rao and Nirmala Sitharaman: ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి!

2014-15లో సెంట్ర‌ల్లీ స్పాన్స‌ర్డ్ స్కీం (సీఎస్ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

  • Telangana Budget: ఫిబ్రవరి మొదటి వారంలో ‘తెలంగాణ’ బడ్జెట్

    Telangana Budget: ఫిబ్రవరి మొదటి వారంలో ‘తెలంగాణ’ బడ్జెట్

  • 35 deliveries a Day: డెలివరీలో ‘జనగాం’ రికార్డ్.. 24 గంటల్లో 35 కాన్పులు!

    35 deliveries a Day: డెలివరీలో ‘జనగాం’ రికార్డ్.. 24 గంటల్లో 35 కాన్పులు!

  • Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?

    Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?

  • Telangana : ప్ర‌స‌వాల్లో ఆగ్ర‌స్థానంలో నిలుస్తున్న సంగారెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి.. ఒక్క డిసెంబ‌ర్ నెల‌లోనే..!

    Telangana : ప్ర‌స‌వాల్లో ఆగ్ర‌స్థానంలో నిలుస్తున్న సంగారెడ్డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి.. ఒక్క డిసెంబ‌ర్ నెల‌లోనే..!

Latest News

  • Hrithik: హృతిక్ నో అంటే.. యశ్ కు జాక్ పాట్.. 1500 కోట్ల ప్రాజెక్టు.

  • Flight: షాక్.. సగం దూరం ప్రయాణించిన ఫ్లైట్ వెనక్కి.. సేఫ్ ల్యాండ్!

  • అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

  • Tarakaratna : ఇంకా విషమంగానే.. తారకరత్న హెల్త్ బులిటెన్ ఇదే

  • TarakaRatna: తారకరత్న తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్స్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: