Minister Harish Rao : ఓచోట కాకుండా మరో చోట లాండైన హరీష్ రావు హెలికాఫ్టర్
మహబూబాబాద్ కు వెళ్తున్న మంత్రి హరీష్ రావు హెలికాఫ్టర్ సమన్వయ లోపంతో రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయింది
- Author : Sudheer
Date : 25-11-2023 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election campaign) లో బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ (BRS) మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఈసారి కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఉండడం తో బిఆర్ఎస్ బాస్ కేసీఆర్ దగ్గరి నుండి చిన్న చితక నేతలు , లీడర్లు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ప్రజల మద్యే ఉంటూ ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ ఓ పక్క రోజుకు మూడు , నాల్గు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వస్తుంటే..మంత్రిలు హరీష్ రావు , కేటీఆర్ లు రోడ్ షో లు చేస్తూ వస్తున్నారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో.. బీఆర్ఎస్ అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నేడు ఉమ్మడి వరంగల్, భువనగిరి జిల్లాలో మంత్రి హరీష్ రావు ప్రచారాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ జిల్లా నుంచి మొదలు… నర్సంపేట, పాలకుర్తి, చేర్యాలలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆలేరు, భువనగిరిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో మహబూబాబాద్ కు వెళ్తున్న మంత్రి హరీష్ రావు హెలికాఫ్టర్ సమన్వయ లోపంతో రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయింది. దీంతో ఒకచోట దిగాల్సిన హెలికాఫ్టర్ మరోచోట దిగింది. మహబూబాబాద్ లో ల్యాండ్ కావాల్సిన హెలికాఫ్టర్ సమన్వయ లోపంతో గూడూరు మండల కేంద్రంలో దిగింది. దీంతో మంత్రి తన పీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది ఏమీ లేకా అందుబాటులో ఉన్న కారులో మహబూబాబాద్ రోడ్ షోకు బయలుదేరారు హరీశ్‌రావు.
Read Also : Amitabh Property : కూతురికి అమితాబ్ అదిరిపోయే గిఫ్ట్.. విలువ, విశేషాలివీ