Amitabh Property : కూతురికి అమితాబ్ అదిరిపోయే గిఫ్ట్.. విలువ, విశేషాలివీ
Amitabh Property : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తన ముద్దుల కూతురు శ్వేతా నందాకు రూ.50.63 కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చారు.
- By Pasha Published Date - 02:07 PM, Sat - 25 November 23

Amitabh Property : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తన ముద్దుల కూతురు శ్వేతా నందాకు రూ.50.63 కోట్లు విలువ చేసే బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఐకానిక్ బంగ్లా ముంబైలోని జుహు ఏరియాలో ఉంది. దీనిపేరు ‘ప్రతీక్ష’. నవంబరు 8న గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ బంగ్లాను ఆమె పేరు మీదకు అమితాబ్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందుకోసం రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ బంగ్లా స్పెషాలిటీ ఏమిటో తెలుసా ? ఇది.. అమితాబ్ తన సంపాదనలో కొనుగోలు చేసిన తొలి ప్రాపర్టీ. బిగ్ బీ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తన తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లతో కలిసి ఈ బంగ్లాలోనే ఉండేవారు. బచ్చన్ కుటుంబానికి ముంబైలో ఇంకా చాలా బంగ్లాలే ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
అమితాబ్ బచ్చన్ తదుపరిగా ‘కల్కి 2898 AD’, ‘తలైవర్ 170’ మూవీలలో మనకు కనిపించనున్నారు. ‘కల్కి 2898 AD’లో అమితాబ్‌తో కలిసి కమల్ హాసన్ నటిస్తుండగా.. ‘తలైవర్ 170’లో అమితాబ్‌తో కలిసి రజనీకాంత్ నటిస్తున్నారు. కాగా, తన కూతురు శ్వేతా నందాకు, కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు సరిసమానంగా ఆస్తులను పంచుతానని 2019 సంవత్సరంలోనే అమితాబ్ ప్రకటించారు. తద్వారా సమాజంలో ఆడపిల్లలను చిన్నచూపు చూడకూడదనే సందేశాన్నిఆయన ఇచ్చారు. స్త్రీ, పురుషులు సరిసమానం అని భావించేవారు వారిద్దరికి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలని ఆనాడు అమితాబ్ పిలుపునిచ్చారు. కాగా, అమితాబ్‌కు దాదాపు రూ.3300 కోట్ల విలువైన ఆస్తులు(Amitabh Property) ఉంటాయని అంచనా.