HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Duddilla Sridhar Babu Unveils Tg Tet 2026 Poster

TG TET-2026: టీజీ టెట్-2026 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుండి..!

T-SAT సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మెరుగైన వసతులు కల్పిస్తూ, 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలను రికార్డు కాలంలో పూర్తి చేశారని గుర్తుచేశారు.

  • Author : Gopichand Date : 18-11-2025 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TG TET-2026
TG TET-2026

TG TET-2026: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుభవార్త అందించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు (నవంబర్ 18) T-SAT నెట్‌వర్క్ ద్వారా ప్రసారం చేయనున్న ‘టీజీ టెట్-2026 డిజిటల్ కోచింగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కంటెంట్ అందిస్తున్న T-SAT నెట్‌వర్క్‌ను అభినందించారు. ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్ష అయిన డీఎస్సీ (DSC)కి టెట్ (TET) అర్హత తప్పనిసరి అయినందున, అభ్యర్థులందరూ T-SAT అందించే డిజిటల్ కంటెంట్ ద్వారా చక్కగా సంసిద్ధులు కావాలని సూచించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సీజన్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహిస్తోందని, నిత్యం అందుబాటులో ఉండే T-SAT కంటెంట్ అన్ని స్థాయిల్లోని అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి గుర్తుచేశారు.

Also Read: Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ?!

44 రోజుల్లో 200 ఎపిసోడ్‌ల డిజిటల్ కోచింగ్

T-SAT సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మెరుగైన వసతులు కల్పిస్తూ, 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలను రికార్డు కాలంలో పూర్తి చేశారని గుర్తుచేశారు. జనవరి 2026లో నిర్వహించనున్న టెట్ పరీక్ష కోసం T-SAT నెట్‌వర్క్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందిస్తోందని సీఈవో తెలిపారు. ప్రసార వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రత్యేక లైవ్ ఓరియంటేషన్: నవంబర్ 18 (మంగళవారం), 19 (బుధవారం) తేదీలలో రెండు రోజుల పాటు లైవ్ ఓరియంటేషన్ ఉంటుంది.

డిజిటల్ కంటెంట్ ప్రసారాలు: తదుపరి 44 రోజుల పాటు 200 ఎపిసోడ్‌లు ప్రసారం చేయబడతాయి.

ప్రసార సమయాలు (ప్రతి రోజు 4 గంట లు)

ఉదయం: విద్య ఛానల్‌లో ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు.

సాయంత్రం: నిపుణ ఛానల్‌లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు.

ప్రత్యేక కంటెంట్ వివరాలు

టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన సబ్జెక్టులైన చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ సైకాలజీ, ఫిజికల్ అండ్ బయాలాజికల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగుతో సహా ఇతర సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ లెసన్స్ ప్రసారం కానున్నాయి. T-SAT నెట్‌వర్క్ ప్రసారం చేసే ఈ ప్రత్యేక కంటెంట్ ఉపగ్రహ ఛానళ్లతో పాటు T-SAT యాప్, యూట్యూబ్‌లో కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉంటుందని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో T-SAT ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాధిక్ పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DSC
  • Education News
  • Minister Sridhar Babu
  • T-SAT
  • telugu news
  • TET
  • TG TET-2026

Related News

Minister Uttam Kumar Reddy

త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌కండి: మంత్రి ఉత్త‌మ్

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రధాన వార్తా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య 'పంచాయితీ' నడుస్తోందని కథనాలు వెలువడ్డాయి.

    Latest News

    • కొల్లాపూర్‌లో విద్యకు కొత్త ఊపిరి: డియాజియో ఇండియా ఆధ్వర్యంలో ఆధునిక మోడల్ పబ్లిక్ లైబ్రరీ

    • ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..ఎందుకంటే..?

    • ఆవాల నూనె వాడడం సురక్షితమేనా?..దీర్ఘకాల వినియోగం గుండె జబ్బులకు దారితీస్తుందా?

    • పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ తెలుసా?

    • సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

    Trending News

      • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

      • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

      • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

      • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

      • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd