Unemployed Youth Protest : రాహుల్..‘మొహబ్బత్ కీ దుకాన్’ అంటే ఇదేనా – బండి సంజయ్ సూటి ప్రశ్న
‘ఇదే అశోక్ నగర్ లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. ఆయన నిరుద్యోగ యువతకు ఇచ్చిన ‘‘మొహబ్బత్ కీ దుకాన్’’ ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు
- By Sudheer Published Date - 04:30 PM, Sun - 14 July 24

గత కొద్దీ రోజులుగా తెలంగాణ నిరుద్యోగులు (Unemployed Youth Protest) కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫుల్ ఫైరింగ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా వేయాలని , కాంగ్రెస్ నిరుద్యోగులకు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఓ పక్క నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ తగ్గకుండా ఎగ్జామ్స్ డేట్స్ ప్రకటించడం..హాల్ టికెట్స్ జారీ చేయడం..పరీక్షల తాలూకా ఏర్పాట్లు చేస్తుంది. మరో నాల్గు రోజుల్లో DSC పరీక్షలు మొదలుకాబోతున్నాయి. అయినప్పటికీ నిరుద్యోగులు మాత్రం తమ ఆందోళనలు ఆపడం లేదు. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ నడిబొడ్డున నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఇలా రోజు రోజుకు నిరుద్యోగుల ఆందోళన ఎక్కువ అవుతున్న తరుణంలో కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi నిరుద్యోగులకు ఇచ్చిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ ఇదేనా అంటూ నిలదీశారు. వెంటనే నిరుద్యోగులతో సామరస్యపూర్వకంగా చర్చించి, వారి ఆందోళనను విరమింప చేయాలని రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి అశోక్ నగర్ లో ఆందోళన చేసిన వీడియోస్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఇదే అశోక్ నగర్ లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. ఆయన నిరుద్యోగ యువతకు ఇచ్చిన ‘‘మొహబ్బత్ కీ దుకాన్’’ ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు. నిరసనలను అణచివేయాలని చూడకుండా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వారి మనోవేదనను తొలగించాలని కోరారు. పరీక్షల షెడ్యూలింగ్, పోస్టుల పెంపు, ఉద్యోగాల క్యాలెండర్‌కు సంబంధించిన సమస్యలకు సానుకూల పరిష్కారం వెతకాలని సూచించారు. ఇక సీఎం రేవంత్ సైతం ‘కొందరు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటున్నారు. మరికొందరు వద్దంటున్నారు. వారి సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మా మంత్రులను కలవాలి. తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం’ అని తెలిపారు. మరి రేవంత్ పిలుపు మేరకు నిరుద్యోగులు మంత్రులను కలుస్తారేమో చూడాలి.
Is this the “Mohabbat ki dukaan” promised by Rahul Gandhi to unemployed youth in Ashok Nagar before elections?
Congress govt in Telangana should immediately address the grievances of the protesting government job aspirants and find an amicable solution to the issues related to… pic.twitter.com/R6x9o5xOPs
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 13, 2024
Read Also : CM Revanth Reddy : ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి