Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి
Feroze Khan : సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు
- By Sudheer Published Date - 08:02 PM, Mon - 7 October 24

హైదరాబాద్ (Hyderabad) నగరంలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. పదేళ్ల బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు , అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న నగరం..ఇప్పుడు దాడులు , ప్రతిదాడులు , అల్లర్లతో వణికిపోతుంది. ఎప్పుడు ఏంజరుగుతుందో అనే టెన్షన్ నగరవాసుల్లో నెలకొంటుంది. ముఖ్యంగా పాతబస్తీ (Old City) లో ఇలాంటి దాడులు అనేకం అవుతున్నాయి. పాతకక్షలతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఇక ఈరోజు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ (Feroze Khan) పై ఎంఐఎం కార్యకర్తలు దాడి (MIM Workers Attack)కి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నాంపల్లి నియోజకవర్గంలో రహదారి పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడు గుంతలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రహదారిపై గుంతలు, తనకు తగిలిన గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు తెలిపాడు. దీంతో ఫిరోజ్ ఖాన్ రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయన వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఈ నేపథ్యంలో నాంపల్లి నియోజకవర్గాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి వైపు వాహనాలకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో మల్లేపల్లి – మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Scuffle broke out between #AIMIM MLA Majid Hussain and Congress leader Feroze Khan who inquired with the contractor carrying out the road works at Vijaynagar colony, Taj Nagar at Nampally #Hyderabad Feroze Khan says that people of the area complained to him as the road works were… pic.twitter.com/NDDOvbFs0i
— Kaniza Garari (@KanizaGarari) October 7, 2024
Read Also : Gymnast Dipa Karmakar: ఆటకు స్టార్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ వీడ్కోలు