Mega Textile Park : ఎట్టకేలకు తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్… ప్రకటించిన ప్రధాని మోడీ
తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ చిరకాల డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని
- By Prasad Published Date - 08:33 AM, Sat - 18 March 23

తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ చిరకాల డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఎట్టకేలకు పరిగణనలోకి తీసుకుంది. పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్) కింద తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. తెలంగాణ, తమిళనాడు మినహా మిగిలిన ఐదు బిజెపి పాలిత రాష్ట్రాలలోనూ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎట్టకేలకు ఫలించాయి. ఆజంజాహీ మిల్లు చాలా కాలం క్రితం మూతపడిన తర్వాత వరంగల్ చరిత్రను పరిగణనలోకి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాయంపేటలో 2 వేల ఎకరాలు కేటాయించారు. 2017 అక్టోబర్ 22న మెగా టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మొదటి దశ కింద 1,200 ఎకరాలు సేకరించగా, రూ.1,552 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో మౌలిక వసతుల కల్పనకు రూ.1100 కోట్లు అంచనా వేశారు.

Related News

BRS Twist : వారెవ్వా! కేసీఆర్ పాలి`ట్రిక్స్` మైండ్ బ్లోయింగ్!
సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ ను మరచిపోయేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్