Medipally Murder : మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. మరదలు సంచలన వ్యాఖ్యలు
Medipally Murder: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన మేడిపల్లి స్వాతి హత్య కేసు మరింత విషాదకరంగా మారుతోంది. గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
- By Kavya Krishna Published Date - 12:25 PM, Mon - 25 August 25

Medipally Murder: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన మేడిపల్లి స్వాతి హత్య కేసు మరింత విషాదకరంగా మారుతోంది. గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పోలీసులు ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టారు. స్వాతి సోదరి శ్వేత, ఎన్టీవీతో మాట్లాడుతూ “మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు. కాలేజీకి వచ్చి పలుమార్లు ఇబ్బందులకు గురి చేశాడు. మా అక్కను హింసించి, చివరికి చంపేశాడు. అతనికి కఠిన శిక్ష విధించాలి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
ఈ ఘటనలో స్వాతి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మరోవైపు మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే స్వాతి తల భాగం ఇంకా దొరకకపోవడంతో, డీఎన్ఏ కోసం శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
స్వాతి అంత్యక్రియలు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మహేందర్ కుటుంబ సభ్యులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు గ్రామస్థులు మహేందర్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో మండిపడుతున్నారు. “ఇలాంటి దారుణానికి పాల్పడిన కుటుంబాన్ని మా ఊరులోకి రానివ్వం” అని గ్రామస్థులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో బందోబస్త్ కట్టుదిట్టం చేశారు.
TDP : జగన్ పరిపాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టింది: యనమల