National Anthem Singing Program : ఇవాళ సామూహిక జాతీయ గీతాలాపన…ఉదయం 11.30గంటలకు ఎక్కడివారక్కడే..!!
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా...తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
- By hashtagu Published Date - 10:36 AM, Tue - 16 August 22
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా…తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరగనుంది. ఉదయం 11.30 కు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సరిగ్గా 11.30 గంటల యావత్ రాష్ట్రం జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే సూచించారు.
వాహనాల్లో వేళ్లేవారు ఎక్కడికక్కడ వాహనాలను ఆపి…అక్కడే జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించారు. ఆ సమయంలో అంత రెడ్ సిగ్నల్ వేయాలని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ఆబిడ్స్ సర్కిల్ లో జరిగే జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు. దీంతో ఆబిడ్స్ నెక్లెస్ రోడ్డు దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏర్పాట్లు పరిశీలించారు. సామూహిక గీతాలాపనలో యావత్ రాష్ట్రమంతా పాల్గొనాలని కోరారు.
అటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్ , సినిమా హాళ్లు, ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించారు. ఈనెల 8న వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించింది తెలంగాణ సర్కార్. ఈనెల 22 వరకు కొనసాగనున్నాయి.