Maoist: మావోల ఎన్నికల బహిష్కరణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్!
మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపునివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.
- By Balu J Published Date - 11:39 AM, Thu - 16 November 23

Maoist: పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక సంఘటనల గురించి నివేదికలు రావడంతో పోలీసులు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపునివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘ఓటింగ్‌కు దూరంగా ఉండండి’ అంటూ పోస్టులు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 7న పూర్తయింది. రెండో దశ నవంబర్ 17న జరగనుంది. నారాయణపూర్ జిల్లాలో ఓ నేత హత్యతో సహా మావోయిస్టులు పాల్గొన్న వరుస హింసాత్మక సంఘటనలను రాష్ట్రం చూసింది. వాస్తవానికి ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి రాకముందే ములుగు జిల్లాలో సాయుధ కేంద్ర, రాష్ట్ర బలగాలు ఉన్నప్పటికీ మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ మరియు ఇతర విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై రివ్యూ చేశారు. ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, నవంబర్ 30న ఓటు వేసేందుకు వీలుగా ప్రతి గ్రామంలో ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. తెలంగాణలో మావోయిస్టుల హింస బాగా తగ్గిందని, ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగకపోవచ్చని మరో అధికారి తెలిపారు. అయినా అప్రమత్తంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
Also Read: BRS Leader: కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు: దాసోజు