Mann Ki Baat : ప్రధాని ‘మన్ కీ బాత్’లో.. ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. దాని విశేషాలివీ
ఈ సంఘానికి టీమ్ లీడర్‌గా కుమ్ర భాగుబాయి(Mann Ki Baat) వ్యవహరిస్తున్నారు.
- By Pasha Published Date - 01:13 PM, Sun - 30 March 25

Mann Ki Baat : ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ 120వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో తెలంగాణలోని ఆదిలాబాద్ ఆదివాసీ మహిళల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి స్వయం ఉపాధి పొందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వారి స్వయం కృషి, ఐకమత్యం అభినందనీయమని చెప్పారు.
Also Read :Ugadi Horoscope 2025 : విశ్వవసు నామ సంవత్సర రాశిఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ?
ఇప్పపువ్వు లడ్డూ కేంద్రం గురించి..
- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్‌లో ‘ఆదివాసీ ఆహారం’ పేరుతో ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
- భీం బాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం అధ్వర్యంలో ఈ కేంద్రాన్ని 12 మంది ఆదివాసీ మహిళలు కలిసి నడుపుతున్నారు.
- ఈ సంఘానికి టీమ్ లీడర్‌గా కుమ్ర భాగుబాయి(Mann Ki Baat) వ్యవహరిస్తున్నారు.
- ఇప్పపువ్వు లడ్డూల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ మహిళలు రక్త హీనత సమస్యను అధిగమిస్తున్నారు.
- ఏటా వేసవిలో ఇప్ప పువ్వు చేతికొస్తుంది.
- వేకువజామునే ఆదివాసీ మహిళలు వెదురుబుట్టలతో అడవిలోకి వెళ్లి దీన్ని సేకరిస్తారు.
- ఇప్పపూలను తీసుకొచ్చి ఎండలో ఆరబెడతారు.
- వీటితో రక రకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు.
- ఈ ఇప్ప పువ్వులతోనూ లడ్డూలను తయారు చేస్తారు.
- ఇప్ప పువ్వులను ఆరబెట్టిన తర్వాత నూనెలో వేయిస్తారు. అనంతరం వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తటి పొడిగా మారుస్తారు.
- ఇప్పపువ్వు చూర్ణంలో వేరుశనగ పల్లిలు, యాలకులు, బాదం, కాజులను కలుపుతారు. అనంతరం ఆ మిశ్రమాన్ని బెల్లం పానకంలో కలిపి లడ్డూలు తయారు చేస్తారు.
- ఈ లడ్డూలను బాక్సులలో పెట్టి విక్రయిస్తారు.
- రూ.400కు కిలో లడ్డు విక్రయిస్తారు. వీటిని తింటే శరీరంలో రక్తం వృద్ది చెందుతుంది.
- ఉట్నూరులోని ఆదివాసీ మహిళల స్వయం కృషిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు అవార్డులను అందించాయి.