Ugadi Horoscope 2025 : విశ్వవసు నామ సంవత్సర రాశిఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ?
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. అదృష్ట దైవం విష్ణుమూర్తి(Ugadi Horoscope 2025).
- By Pasha Published Date - 12:25 PM, Sun - 30 March 25

Ugadi Horoscope 2025 : మనం ఇవాళ (మార్చి 30న) విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ? వారు జీవితాల్లో ఎలాంటి మలుపులను చూడబోతున్నారు ? అనేది జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం తెలుసుకుందాం..
మేషరాశి
- ఈ రాశి వారికి అదృష్టయోగం 75 శాతం ఉంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట దైవం సూర్యుడు.
- ఖర్చులు పెరుగుతాయి. రాహువు పంచమ కేతువులో ఉండగా ఖర్చులు ఆదాయానికి మించిపోతాయి.
- వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి.
- ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలూ, వ్యాపారులకు అనుకోని అవాంతరాలూ ఎదురుకావచ్చు.
- ఆదాయం: 2; వ్యయం: 14 రాజపూజ్యం: 5; అవమానం: 7
వృషభ రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. అదృష్ట దైవం విష్ణుమూర్తి(Ugadi Horoscope 2025).
- ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇబ్బందులు తొలగిపోతాయి.
- ఉద్యోగంలో పదోన్నతులు వరిస్తాయి.
- స్తోమతకు మించిన ఖర్చులు చేయొద్దు.
- అపాత్రదానం వల్ల కష్టార్జితం వృథా అవుతుంది.
- కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఆదాయం: 11; వ్యయం: 5 రాజపూజ్యం: 1; అవమానం: 3
Also Read :Ikea Marriage Test : ఐకియా మ్యారేజ్ టెస్ట్ గురించి తెలుసా ?
మిథున రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. అదృష్ట దైవం లక్ష్మీదేవి.
- అదృష్టయోగం 75 శాతం మేర ఉంది.
- ఆర్థిక సమస్యలు బాధించవు.
- సెప్టెంబరు దాకా గురుబలం సహకరించదు.
- వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అవరోధాలు ఎదురుకావచ్చు.
- ఓ లావాదేవీలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు.
- వాహనాల వేగానికి పరిమితి అవసరం.
- ఆత్మీయుల మనసు కష్టపెట్టొద్దు.
- ఆదాయం: 14; వ్యయం: 2; రాజపూజ్యం: 4; అవమానం: 3
కర్కాటక రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు.
- అదృష్టయోగం యాభైశాతం మేర ఉంది.
- ఖర్చులు తక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులను పరిహరించండి. జూదాల జోలికి వెళ్లకండి.
- మే 14 తర్వాత గురుబలం తగ్గుతుంది.శని, రాహువు పెద్దగా సహకరించడం లేదు. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది.
- అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
- ఆదాయం: 8; వ్యయం: 2; రాజపూజ్యం: 7; అవమానం: 3
సింహ రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1. అదృష్ట దైవం శివుడు.
- అదృష్టయోగం పావు శాతం ఉంది.
- ఆదాయం, ఖర్చులు పెరుగుతాయి.
- భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి.
- ఈ ఏడాది అవమానమే అధికం.
- ఆస్తిపాస్తుల విషయంలో కోర్టు వ్యాజ్యాలకు ఆస్కారం ఉంది.
- వ్యాపారంలో అస్థిరత తొలగుతుంది.
- ఆదాయం: 11; వ్యయం: 11 రాజపూజ్యం: 3; అవమానం: 6
కన్య రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. అదృష్ట దైవం శివుడు.
- పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది.
- ఆదాయం లభిస్తుంది. ఖర్చులు అత్యల్పం.
- మే 14 నుంచి అక్టోబరు వరకూ ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి.
- కేతువు పెద్దగా సహకరించకపోవచ్చు.
- ఆదాయం: 14; వ్యయం: 2 రాజపూజ్యం: 6; అవమానం: 6
Also Read :Beard Style Vs Personality : ఒక్కో గడ్డం.. ఒక్కో సంకేతం.. ఒక్కో సందేశం..
తుల రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. అదృష్ట దైవం శివుడు.
- నూటికి నూరుశాతం అదృష్టయోగం ఉంది.
- ఆదాయం బావుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి.
- మే 14 నుంచి గురుగ్రహం భాగ్యాన్నీ, అదృష్టాన్నీ ప్రసాదిస్తుంది.
- రాహువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు, ఆర్థిక నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి.
- ఉద్యోగులు పదోన్నతులు సాధిస్తారు. వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
- ప్రజా జీవితంలో ఉన్నవారిని గెలుపు వరిస్తుంది.
- ఆదాయం: 11; వ్యయం: 5 రాజపూజ్యం: 2; అవమానం: 2
వృశ్చిక రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9. అదృష్ట దైవం శివుడు.
- అదృష్టయోగం పరిపూర్ణం.
- ఆదాయం స్వల్పం. ఖర్చులు అధికం.
- అవమానం కంటే రాజపూజ్యమే అధికం.
- భార్యాపిల్లలకు మేలు జరుగుతుంది.
- మే 14 నుంచి గురువు అష్టమ స్థానంలో ఉంటాడు. సుదూర ప్రయాణాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
- చర్చలూ, సంప్రదింపుల సమయంలో ఉద్వేగాలపైన నియంత్రణ కోల్పోకూడదు.
- వ్యాపారులు ఇబ్బందులను అధిగమిస్తారు.
- ఆదాయం: 2; వ్యయం: 14 రాజపూజ్యం: 5; అవమానం: 2
ధనుస్సు రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యస్వామి.
- అదృష్టయోగం 75 శాతం మేర ఉంది.
- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.
- మే 14 నుంచి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
- వృత్తి నిపుణులు గౌరవ పురస్కారాలు అందుకుంటారు.
- ఈ రాశివారికి రాహుకేతువులు ఏదో ఓ రూపంలో మేలు చేస్తారు.
- ఉద్యోగులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.
- ఆదాయం: 5; వ్యయం: 5 రాజపూజ్యం: 1; అవమానం: 5
మకర రాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. అదృష్ట దైవం లక్ష్మీదేవి.
- పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంది.
- ఆదాయం పుష్కలం. శక్తికి మించి ఖర్చు చేస్తారు.
- రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా ఉంది.
- గురువు షష్ఠమ స్థానంలో ఉన్నప్పుడు శత్రుపీడ మనశ్శాంతిని మింగేస్తుంది. బలహీనులైన ప్రత్యర్థులకు సైతం ఎక్కడలేని బలం వస్తుంది.
- వాహన ప్రయాణంలో హద్దులు మీరిన వేగాన్ని పరిహరించాలి.
- ఆదాయం: 8; వ్యయం: 14 రాజపూజ్యం: 4; అవమానం: 5
కుంభరాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. అదృష్ట దైవం విష్ణుమూర్తి.
- అదృష్టయోగం 25 శాతం మాత్రమే ఉంది.
- సంపదలు వృద్ధి చెందుతాయి.అదే సమయంలో క్రమానుగతమైన ధనక్షయం గోచరిస్తోంది.
- అవమానం కంటే రాజపూజ్యం ఎక్కువగా ఉంది.
- శని ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లకు ఆస్కారం ఉంది.
- రాహుకేతువులు వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉంటాయి.
- ఆదాయం: 8; వ్యయం: 14 రాజపూజ్యం: 7; అవమానం: 5
మీనరాశి
- ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. అదృష్ట దైవం దుర్గాదేవి.
- అదృష్టయోగం యాభై శాతం మేర ఉంది.
- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.
- అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ.
- మిత్రబలం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది.
- గురువు తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిపాటి అవరోధాలు ఉంటాయి.
- ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం ప్రారంభమైంది. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.
- రాహు-కేతు దోషాలూ ఉన్నాయి. ఆరోగ్యంపైన రాహువు ప్రభావం ఉంటుంది.
- ఆదాయం: 5; వ్యయం: 5 రాజపూజ్యం: 3; అవమానం: 1
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.