Man Sell Alcohol on Vegetable Cart : కేటీఆర్ ఇలాకాలో తోపుడు బండిపై కూరగాయలతో పాటు మద్యం అమ్మకం..
ప్రతి ఏటా కోట్లాది రూపాయిలు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మద్యం పాలసీ నడిపిస్తున్నారు
- Author : Sudheer
Date : 23-09-2023 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో మద్యం (Alcohol ) అమ్మకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ (CM KCR) అధికారం చేపట్టిన దగ్గరి నుండి కూడా మద్యం అమ్మకాలతోనే సంక్షేమ పధకాలు అందిస్తున్నారు. ప్రతి ఏటా కోట్లాది రూపాయిలు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మద్యం పాలసీ నడిపిస్తున్నారు. కేసీఆర్ మద్యం పాలసీని పొగిడేవారు ఉన్నారు అలాగే తిట్టేవారు ఉన్నారు. కేసీఆర్ వల్లే చాలామంది మందుబాబులు అయ్యారని ప్రతిపక్షాలు అప్పుడప్పుడు విమర్శలు చేస్తుంటుంది.
తాజాగా కేటీఆర్ (Minister KTR) ఇలాకా రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం (Rajanna Sircilla Constituency) లో ఓ వ్యక్తి ఏకంగా కూరగాయలతో పాటు మద్యం అమ్ముతూ బజార్లలో హల్చల్ చేసాడు. ప్రభుత్వం మద్యం పాలసీకి వ్యతిరేకంగా సోమిశెట్టి దశరథం (Somishetty Dasharadham) అనే వ్యక్తి తోపుడు బండి పై ఓవైపు కూరగాయలు, మరోవైపు బీరు (Beer), వీస్కీ బాటిల్ పెట్టుకుని పట్టణ వీధుల్లో అమ్మాడు. కూరగాయలు, బీర్లు, విస్కీ బాటిళ్లు అంటూ కేకలు వేస్తూ అమ్మకాలు చేస్తుండడం తో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఆయన దగ్గరికి వచ్చారు. ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే.. ప్రభుత్వ మద్యం పాలసీని ఎండగట్టారు. ప్రస్తుత మద్యం పాలసీతో జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ముందుకు కదిలారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరిని తాగుబోతులను చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఈయన అమ్మకలకు సంబదించిన వీడియోస్ , ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Gold Laddu : గణపయ్య చేతిలో ‘బంగారు లడ్డు’..చూసేందుకు వస్తున్న భక్తులు