HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Man Asks Voters To Return Money

TG Polls : ఇదెక్కడి లొల్లి..ఓటుకు ఇచ్చిన డబ్బులు వెనక్కు అడుగుతున్న అభ్యర్థులు

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కాళ్లావేళ్లా పడటం చూస్తుంటాం. మద్యం, బిర్యానీ, నగదు, చీరలు ఇలా ఆశామాయీగా పంపిణీ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తారు. అయితే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది

  • Author : Sudheer Date : 15-02-2026 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Man Asks Voters To Return M
Man Asks Voters To Return M

Man asks voters to return money : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కాళ్లావేళ్లా పడటం చూస్తుంటాం. మద్యం, బిర్యానీ, నగదు, చీరలు ఇలా ఆశామాయీగా పంపిణీ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తారు. అయితే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. తాము గెలిపిస్తారని నమ్మి పంపిణీ చేసిన డబ్బులు, బహుమతులు ఇప్పుడు ఓడిపోయాక అభ్యర్థులు తిరిగి అడుగుతుండటం ఓటర్లను విస్మయానికి గురి చేస్తోంది. మేడ్చల్, మంచిర్యాల, భువనగిరి వంటి ప్రాంతాల్లో ఓడిపోయిన అభ్యర్థులు నేరుగా ఓటర్ల ఇళ్లకే వెళ్లి, “నాకు ఓటు వేయలేదు కాబట్టి, నేను ఇచ్చినవి తిరిగిచ్చేయండి” అని డిమాండ్ చేస్తుండటంతో గ్రామాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మూడుచింతలపల్లిలో ఓ అభ్యర్థి తాను పంచిన చీరలు, నగదు, మద్యం ఖర్చును కూడా లెక్కగట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఓడిపోయామన్న కోపంతో ఇంటింటికీ తిరిగి ఇచ్చినవి వెనక్కి తీసుకోవడం అక్కడ పెద్ద చర్చకు దారితీసింది. అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక అభ్యర్థి అయితే ఏకంగా ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదనే లెక్కలు తీసి, ఓటు వేయని వారి దగ్గర బహుమతులను బలవంతంగా గుంజుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఓడిపోయిన ఒక అభ్యర్థి తాను పంచిన హాట్ బాక్సులు, చీరల కోసం జనం వెంట పడటం చూస్తుంటే ఎన్నికల వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది.

ఈ ఘటనలు ప్రజాస్వామ్యంలోని విలువలపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఓటును నోటుతో కొనాలని చూసిన అభ్యర్థులు, ఆశించిన ఫలితం రాకపోయేసరికి ఇలా “వసూల్ రాజా” అవతారమెత్తడంపై సామాన్యులు మండిపడుతున్నారు. “ఎన్నికలప్పుడు ఇచ్చేటప్పుడు ఆశ చూపించి, ఇప్పుడు వెనక్కి అడగడం ఏంటి?” అని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు వేలం వేసి కొనుగోలు చేసే సంస్కృతి పెరిగిపోవడంతో, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలాంటి ‘లొల్లి’లు తప్పడం లేదు. ఈ వింత ధోరణి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • distributed After His Loss
  • Man asks voters to return money
  • Telangana Municipal Elections
  • TG Polls
  • voters

Related News

Telangana Municipal Results

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. బీఆర్ఎస్, బీజేపీ ?

TelanganaPolitics  మున్సిపల్​ఎన్నికల ఫలితాలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమదే విజయమని అభివర్ణించుకుంటున్నాయి. ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకుని మూడు ప్రధాన పార్టీల నాయకులు ఇదే రకమైన వాదనలను వినిపిస్తున్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే స్థానాలు సాధించామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్​పార్టీల నేతలు చెబుతున్నారు. పట్టణాల్లోనూ తమకే పట్టం కట్టారని, 116 మున్సిపాలిటీ

  • Janasena Party

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

  • Telangana Municipal Election Results

    నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • Telangana Municipal Elections

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

Latest News

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

  • పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన భార‌త్‌!

  • Gold Crash: లక్ష రూపాయలకే తులం బంగారం !! ఏంటి నిజమా ?

  • టాస్ ఓడిన భార‌త్‌.. మొద‌ట బ్యాటింగ్ ఎవ‌రిదంటే?!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd