Mallareddy : మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోరుతున్న మల్లారెడ్డి..కేసీఆర్ ఇస్తాడా..?
- By Sudheer Published Date - 07:47 PM, Thu - 4 January 24

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election) మేడ్చల్ (Medchal ) నుండి విజయం సాధించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy)..ఇప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ (Malkajgiri MP Ticket) కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ఫై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో..లోక్ సభ ఎన్నికల్లో అలాగే సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే ఇంచార్జ్ లను నియమించి ఎన్నికలకు సంబదించిన వ్యూహాలు రచిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క బిఆర్ఎస్ (BRS) సైతం లోక్ సభ ఎన్నికలను చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడైతే ఓటమి చవిచూసామో..అక్కడే విజయ డంఖా మోగించాలని చూస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తడబడిన కేసీఆర్ (KCR)..ఈసారి అలాంటి తప్పు జరగకుండా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గురువారం మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ (KTR)ను కలిసిన మల్లారెడ్డి.బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా పనిచేశానన్నారు. ఈ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని, ఈసారి గతం కంటే ఎక్కవ లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read Also : Telangana: సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలపై సీబీఐ విచారణ..!