Mahmood Ali : గణతంత్ర వేడుకల్లో స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
- By Sudheer Published Date - 11:50 AM, Fri - 26 January 24

మాజీ హోంమంత్రి మహమూద్ అలీ (Former Telangana Deputy CM Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్లో (Telangana Bhawan) జరిగిన గణతంత్ర వేడుకల్లో (Republic Day 2024 Celebrations) పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న నేతలు ప్రాథమిక చికిత్స అందించి.. ఇంటికి తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో గవర్నర్ తమిళసై తీరుపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్‌భవన్ నడుస్తున్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంను ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా గవర్నర్ తమిళిసై పనిచేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను పార్టీల్లో ఉన్నారంటూ ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని సిఫారసు చేస్తే ఆమోదించారని తెలిపారు. ఇది ద్వంద్వ నీతి కాదా, కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించడం కాదా అని ప్రశ్నించారు.
#WATCH | Hyderabad: Former Telangana Deputy CM Mahmood Ali faints during #RepublicDay2024 celebrations at Telangana Bhawan. pic.twitter.com/GCzoMb9l8U
— ANI (@ANI) January 26, 2024
Read Also : Husbands Swapping : భర్తలను మార్చుకున్న ఇద్దరు యువతులు.. నాలుగేళ్ల తర్వాత ఏమైందంటే ?