HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mahalaxmi Scheme From Tomorrow 2

Mahalaxmi Scheme : రేపటి నుంచి రూ.500లకే సిలిండర్‌..!

  • Author : Kavya Krishna Date : 26-02-2024 - 6:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
LPG Price Cut
LPG Price Cut

6 గ్యారెంటీల హామీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) వరుసగా పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకానికి సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం . అయితే ఈ పథకంలో లబ్ధిదారులు ముందుగా గ్యాస్ మొత్తం ఖర్చును చెల్లించాలని, ఆ తర్వాతే ప్రభుత్వం వారికి తిరిగి చెల్లిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.40 సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ధర రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా అదే విధంగా రీయింబర్స్‌మెంట్ ఇస్తామని వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా కేంద్రం ఒక్కో సిలిండర్‌పై రూ.340 సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తానికి అదనంగా గ్యాస్ ధర రూ.500 మినహా మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు, హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.970 అయితే, ఉజ్వల పథకం సబ్సిడీ రూ.340, మహాలక్ష్మి పథకం ధర రూ.500, మిగిలిన మొత్తం రూ.130 రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)తో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం లబ్ధిదారుల జాబితాను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మహాలక్ష్మీ స్కీం కింద మహిళలకు తెలంగాణ ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme) కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. మరోవైపు రూ.500లకే సిలండర్‌, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ కరెంటు పథకాలను రేపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ పర్యటన రద్దైంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Read Also : Atchannaidu : ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను‌ సర్వనాశనం చేసారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • big news
  • breaking news
  • Latest News
  • Mahalaxmi Scheme
  • telugu news

Related News

Yarraji Jyoti

యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్

కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు లక్షలాది మంది యువతీ యువకులకు స్ఫూర్తిప్రదాత. 100 మీటర్ల హర్డిల్స్‌లో దేశంలోనే అత్యుత్తమ టైమింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఆమె, అనేక అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.

  • Telangana Municipal Elections

    Breaking News : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రెడీ .. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

  • Donald Trump

    అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd