Mahabubabad : మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత పదిరోజుల క్రితం ఓ మహిళకి ఆడపిల్ల పుట్టింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ దంపతులు బాధకు లోనయ్యారు
- By Sudheer Published Date - 04:33 PM, Sat - 21 October 23

రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న..మహిళలు సైతం మగవారికి పోటీగా విజయాలు సాధిస్తున్న..ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం, ఆడపిల్లల్ని( Girls ) చంపేయడం..లేదంటే ఆడపిల్ల పుడితే హాస్పటల్ లోనే వదిలివెళ్లడం చేస్తూనే ఉన్నారు.. మగ పిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని, ఆడపిల్ల పుడితే అరిష్టమని ఇంకా భవిస్తూ ఉన్నారు. తాజాగా మహబూబాబాద్ (Mahabubabad ) ప్రభుత్వ ఆసుపత్రి (Govt Hospital)లో దారుణం చోటుచేసుకుంది. నాల్గో కాన్పులోనూ ఆడ పిల్ల పుట్టిందని (Baby Girl was Born) హాస్పటల్ లోనే వదిలేసి వెళ్లారు.
మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత పదిరోజుల క్రితం ఓ మహిళకి ఆడపిల్ల పుట్టింది. అయితే నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ దంపతులు బాధకు లోనయ్యారు. ఇక ఆ పసికందును వదిలించులోవాలని అనుకున్నారు. కన్న బిడ్డ అనే మమకారం కూడా లేకుండా, ముక్కుపచ్చలారని పసికందును ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో గత పది రోజుల నుండి ఆసుపత్రి సిబ్బంది ఆ పాపకు తల్లై అలనా పాలన చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాప ఆరోగ్యం బాగానే ఉంది అని తెలియ చేసిన వైద్యులు బాలల సంరక్షణ భవన్ కు పాపను అప్పగిస్తామని తెలిపారు. ఈ విషయం తెలిసి స్థానికులు మండిపడుతూ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Brahmani Mind Game: నారా బ్రాహ్మణి మైండ్ గేమ్