Couple Suicide: విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య..!
తెలంగాణలో విషాదం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో
- By Gopichand Published Date - 01:45 PM, Wed - 9 November 22

తెలంగాణలో విషాదం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో రైల్వే ట్రాక్ పై ప్రేమజంట ఆత్మ హత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. అమ్మాయికి ఇటీవల వివాహం జరిగింది. మంగళవారం రోజు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పిటిషన్ ఇరువురు తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు.
బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడుత గణేష్ (25) వైకుంఠ నలంద (22)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.