HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Lights In The Lives Of Singareni Workers With Kcr Brs Leader Kavitha

Kalvakuntla Kavitha: కేసీఆర్ తో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు : కల్వకుంట్ల కవిత

సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని కవిత గుర్తు చేశారు.

  • Author : Balu J Date : 06-12-2023 - 5:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavithabrs
Kavithabrs

Kalvakuntla Kavitha: సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య బుధవారం నాడు హైదరాబాద్ లో కవిత కలిసి అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ… సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో 50 శాతం ఉన్నారు కాబట్టి తమ యూనియన్ లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేర్కొన్నారు. జాతీయ సంఘాల కారణంగా 1998 వరకు కారుణ్య నియామకాలకు గండి పడిందని అన్నారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని నొక్కిచెప్పారు. సంస్థను లాభాలబాట పట్టించడానికి, సంస్థ ఎదుగుదలకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. 1999-2000లో లాభాల్లో కార్మికులకు కేవలం 10 శాతం వాటా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 18 శాతంగా ఉండేదని, దాన్ని కేసీఆర్ 32 శాతానికి పెంచారని వివరించారు. తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని తెలియజేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61కి పెంచామమని, గతంలో సమ్మె చేస్తే సంస్థ జీతం ఇచ్చేది కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని ప్రస్తావించారు.

కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం, క్వార్టర్స్ లో నివసించే వారు బేసిక్ లో 1 శాతం సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం, కార్మికులు మెడికల్ అన్ ఫిట్ అయితే వేతన రక్షణ కల్పించడం, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ. 10 లక్షల వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత వివరించారు.

Also Read: Mamata Banerjee: ఎన్నికలకు ముందు బీజేపీ తప్పుడు హామీలు ఇచ్చింది : మమతా బెనర్జీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • elections
  • kalvakuntla kavitha
  • singareni

Related News

Kalvakuntla Kavitha New Party in April

Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

Kalvakuntla Kavitha  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్

    Latest News

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    Trending News

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd