Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు
Local Body Elections Telangana : పండుగ సీజన్‌లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఖర్చు పెట్టాలా వద్దా అనే ప్రశ్నపై కూడా ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు
- By Sudheer Published Date - 01:52 PM, Tue - 30 September 25

తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ (Local Body Elections) విడుదలైన వెంటనే రిజర్వేషన్ల అంశంపై ఆసక్తి కనబరిచే ఆశావహులలో అనిశ్చితి నెలకొంది. ఒకవైపు రిజర్వేషన్లపై కేసు కోర్టులో విచారణలో ఉండగా, మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ అయోమయం మరింత పెరిగింది. ఎవరికి ఏ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంటుందో, ఏ వర్గానికి రిజర్వేషన్ దక్కుతుందో స్పష్టత లేకపోవడం అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టింది.
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
పండుగ సీజన్‌లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఖర్చు పెట్టాలా వద్దా అనే ప్రశ్నపై కూడా ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు. తీరా పెద్ద ఎత్తున ఖర్చు చేసిన తర్వాత కోర్టు రిజర్వేషన్లను రద్దు చేస్తూ లేదా మార్పులు చేస్తూ తీర్పు ఇస్తే తమ పెట్టుబడి వృథా అవుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రచార వ్యూహం, ఖర్చు ప్రణాళిక, మద్దతు వర్గాల కేటాయింపు అన్నీ ఈ అనిశ్చితి వల్ల దెబ్బతిన్నాయి.
ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ కోర్టు తీర్పుపై నిలిచింది. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు అభ్యర్థుల ఉత్కంఠ కొనసాగుతుందని, తీర్పు వెలువడిన తర్వాతే వారిలోని అయోమయం తొలగి ప్రచారం పూర్తి స్థాయిలో మొదలవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ వాతావరణం ఎప్పుడు స్పష్టత చెందుతుందో కోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మొత్తానికి రిజర్వేషన్ అంశం ఎన్నికల వాతావరణాన్ని, వ్యూహాలను ప్రభావితం చేస్తోంది.