Lady Aghori Naga Sadhu Remand : అఘోరీకి రిమాండ్
Lady Aghori Naga Sadhu Remand : సనాతన ధర్మం, దేశ రక్షణ అంటూ ప్రచారం చేస్తున్న ఈమె అసలు స్వరూపం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది
- Author : Sudheer
Date : 23-04-2025 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన లేడీ అఘోరి (Lady Aghori Naga Sadhu) వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సనాతన ధర్మం, దేశ రక్షణ అంటూ ప్రచారం చేస్తున్న ఈమె అసలు స్వరూపం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. యోని పూజ పేరుతో ఓ మహిళను మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ లేడీ అఘోరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు.
Terrorists : జమ్మూ కాశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..భద్రతా సంస్థలు వెల్లడి!
శంకర్‌పల్లి మండలానికి చెందిన ఓ మహిళా నిర్మాత కథనం ప్రకారం..ఆరు నెలల క్రితం లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. మొదట మతపరమైన చర్చలతో సంబంధం ఏర్పడగా, తర్వాత తరచూ ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. “యోని పూజ” చేస్తే మంచి జరుగుతుందని చెప్పి నమ్మబలికింది. తొలి విడతగా రూ. 5 లక్షలు తన అకౌంట్‌లో వేయించింది. తర్వాత యూపీలోని ఉజ్జయినిలో ఒక ఫాం హౌస్‌కు తీసుకెళ్లి పూజ చేశానంటూ, మరుసటి రోజు మిగిలిన రూ. 5 లక్షలు కూడా డిమాండ్ చేసింది. ఈ మొత్తాన్ని కూడా బెదిరింపులతో వసూలు చేసిందని బాధితురాలు తెలిపారు.
ఈ ఫిర్యాదుతో రంగారెడ్డి పోలీసులు లేడీ అఘోరి పై మోసం, బెదిరింపు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉండగా విచారణ కొనసాగుతోంది.