Munugode TRS Candidate : మునుగోడు టీఆరెస్ అభ్యర్థి ఖరారు.. కూసుకుంట్ల పేరు ఫైనల్!!
◻️మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు.
- Author : Hashtag U
Date : 07-10-2022 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.2014లో మునుగోడు నుంచి గెలిచారు కూసుకుంట్ల. దీనితో పాటు రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ కోసం కృషిచేసిన ఆయన..2003 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.,