Munugode : ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
- Author : Sudheer
Date : 11-11-2023 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల ప్రచారం (Election Campaign)లో అభ్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఫై విరుచుకపడమే కాదు కొంతమంది ఓటర్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మునుగోడు (Munugode) బిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ (Kusukuntla Prabhakar Reddy)..ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చి వివాదంలో చిక్కుకున్నాడు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఉదయం నుండి రాత్రి వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలోని కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంతో.. ఆయన ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూసుకుంట్ల వ్యాఖ్యలకు స్థానికులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడిగితే కుక్కలతో పోలుస్తారా అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఎమ్మెల్యేకు ఓటు రూపంలో గుణపాఠం చెపుతామని అంటున్నారు.
ఇక మునుగోడు బరిలో బిఆర్ఎస్ నుండి ప్రభాకర్ ..బిజెపి నుండి చలమల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుండి రాజగోపాల్ రెడ్డి నిల్చున్నారు. ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికార బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే నేడు సిపిఐ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుంది.. CPM పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. మరి ప్రజలకు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలి.
Read Also : Fire Breaks Out in Crackers Shop : రాజేంద్ర నగర్‌లోని క్రాకర్స్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం