HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kurchi Thatha Dies Of Heart Attack

Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

  • Author : Vamsi Chowdary Korata Date : 21-05-2026 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
kurchi-thatha-dies-of-heart-attack
kurchi-thatha-dies-of-heart-attack

“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాషా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భార్య ఒడిలోనే తలపెట్టి ప్రాణాలు కోల్పోయారు.

వరంగల్‌ కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ పాషా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాషా హైదరాబాద్‌లోని కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగేవారు. అక్కడే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. అక్కడ ఓ ఇంటర్వ్యూలో కుర్చీ మడత పెట్టి డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. అలా ఆయన పేరు పాషా నుంచి కుర్చీ తాతగా మారింది. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇంతలో పాషాకు కుర్చీ మడత పెట్టి డైలాగ్‌కు సినిమాలో కూడా ఛాన్స్ దక్కింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలోని పాటలో కుర్చీ తాత డైలాగ్ వాడేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ డైలాగ్‌ను కాస్త రీమిక్స్ చేసి పాటలో వాడేయడంతో పాషా మరింత ఫేమస్ అయ్యారు. థమన్ ఆ కుర్చీని మడతపెట్టి డైలాగ్ వాడుకున్నందుకు పాషాకు కొంత డబ్బులు కూడా ఇచ్చారు.

గతంలో కుర్చీ తాత చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చనిపోలేదంటూ కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. కుర్చీతాత మీడియా ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని, తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పారు. అప్పటి నుంచి కృష్ణకాంత్ పార్క్ దగ్గర మళ్లీ కనిపిస్తున్నారు. అయితే కుర్చీతాత అదే పార్క్ దగ్గరకు ఎండల దెబ్బకు తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. పాషా కుటుంబానికి కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు అండగా నిలిచారు, వారికి తోచిన విధంగా సాయం అందించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • krishna kanth park
  • Kurchi Thatha
  • passed away
  • rest in peace

Related News

Union Minister Bandi Sanjay's mother falls critically ill.

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని నివాసంలో అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆస

  • Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

    Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

Latest News

  • US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

  • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

  • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

  • Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd