CM Revanth Reddy : బ్లాక్‌మెయిల్ సీఎం అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy : రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిందని, నిరసనలు చేసేందుకు కూడా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని విమర్శించారు
- By Sudheer Published Date - 04:08 PM, Mon - 4 November 24

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సీఎం రేవంత్ (CM Revanth Reddy) పై , కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తిరుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేతగాని పాలనతో రాష్ట్రం ఆగం అవుతోందని.. ఏడాది పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని.. నాలుగేళ్ల పాలనతో తెలంగాణ ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి బహిరంగ లేఖ రాస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిందని, నిరసనలు చేసేందుకు కూడా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారని, వివిధ వర్గాలు రోడ్డెక్కుతున్నాయని వ్యాఖ్యానించారు. కంపెనీలు రాష్ట్రం నుంచి తరలి పోవడంతో, రాష్ట్ర ఆదాయం పడిపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికున్న అనుభవ రాహిత్యంతో తెలంగాణ వెనక్కి వెళ్ళిపోతుందని అన్నారు. తీరా చేయాల్సిన అన్యాయమంతా చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జు ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
దొరికిందే అవకాశమని ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరి ట్యాక్స్ వాళ్లకు కట్టే పరిస్థితి తెచ్చారు. మీ ముఖ్యమంత్రి బహిరంగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కుంభకోణాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. ఇది చాలదన్నట్లుగా కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్లు మూసీ ప్రాజెక్ట్ తెరపైకి తెచ్చారు. రూ.1.50లక్షల కోట్లతో చేపడుతామంటున్న ఈ ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనాల కోసమో? ఈ మొత్తం సొమ్ములో ఢిల్లీ వాటా ఎంత? పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకొని ఈ ప్రాజెక్ట్ కు మీ ఆమోదం లేకుండానే జరుగుతోందా? అంటూ ప్రశ్నించారు.
Read Also : CM Revanth Reddy Padayatra : ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ పాదయాత్ర..