KTR: ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశా నిర్దేశం
ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్.
- By Balu J Published Date - 10:35 AM, Mon - 13 March 23

తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల వేళ.. ప్రజా ప్రతినిధులు మరింతగా ప్రజలకు చేరువ కావాలని పార్టీని బలోపేతం చేయాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వారికి పలు సూచనలు చేశారు. ఆత్మీయ సమ్మేళనాలు.. పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు మంత్రి కేటీఆర్. 60లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేయబోతున్నట్టు తెలిపారు కేటీఆర్.
బీఆర్ఎస్ కి కార్యకర్తలే బలమన్న ఆయన.. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ఈ బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. 10 గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని కోరారు. ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏ సమయాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారనే విషయాన్ని పార్టీ కార్యాలయానికి తెలపాలని సూచించారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను త్వరితగతిన ప్రారంభించుకోవాలని, ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపునే కాకుండా, పార్టీ తరపున కూడా ఘనంగా నిర్వహించాలని సూచించారు కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, నూతన సచివాలయానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. దేశ చరిత్రలో అంబేద్కర్ వారసత్వాన్ని, స్ఫూర్తిని ఇంత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లే పార్టీ మరొకటి లేదన్నా

Related News

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే
మే పదో తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.