Congress : రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు – కేటీఆర్
Congress : మార్చి 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు
- Author : Sudheer
Date : 13-03-2025 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. జగదీష్ రెడ్డిని అన్యాయంగా సభ నుంచి బహిష్కరించారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో ఉన్న అబద్ధాలను ప్రశ్నించడమేనని, కానీ కాంగ్రెస్ నేతలు అపార్థం చేసుకుని రాద్ధాంతం చేశారని బీఆర్ఎస్ వాదిస్తోంది. అసెంబ్లీలో తన గొంతు నొక్కేశారని జగదీష్ రెడ్డి అనడం, దీనికి బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుగా నిలవడం విశేషం.
Gods Laddoo Shop: దేవుడి లడ్డూ షాప్.. డబ్బులుంటే ఇవ్వొచ్చు.. లేకుంటే ఫ్రీ
జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం (Burning of Congress government effigies) చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తమ పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అనని మాటలను కూడా అన్నట్టుగా చిత్రీకరించారని, తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా, స్పీకర్ తమ వాదన వినలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AB de Villiers On Rohit Sharma: రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి? ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు!
ఇక సభ నుంచి బీఆర్ఎస్ కీలక నేతను సస్పెండ్ చేయడం, దీనిపై ప్రతిపక్షం పెద్దఎత్తున ఆందోళన చేయడం, కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం తెలంగాణలో రాజకీయ వేడిని పెంచుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం జరిగే బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర రాజకీయాలను మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.