HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Visited Anirudh Family Members

KTR : అనిరుధ్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్‌

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై కేటీఆర్ ఆవేదన

  • Author : Latha Suma Date : 12-08-2024 - 5:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR visited Anirudh family members
KTR visited Anirudh family members

KTR: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అనిరుధ్ కుటుంబం నివసిస్తున్న గ్రామానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు(సోమవారం) వెళ్లారు. అక్కడ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారుడు పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనిరుధ్ మరణం ముమ్మాటికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో వివిధ పాఠశాలల్లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారని ఆయన అన్నారు. “గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మంచిచెడులు చూసుకునే వారు కరవయ్యారు. ఎన్నికలు ఇంకో 4 ఏళ్ల తరువాత ఉన్నాయి. ఈ అంశంపై మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వీలైతే కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి. విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ అధ్యయనానికి కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందం ఏర్పాటు చేస్తాం. ఈ బృందం ఓ రిపోర్ట్‌ను తయారు చేస్తుంది. దాన్ని ప్రభుత్వానికి అందజేస్తాం. కేవలం 8 నెలల కాలంలో 500 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. ప్రభుత్వం ఇకనైనా మేలు కోవాలి, అన్ని పాఠశాల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలి. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలి” అని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

LIVE : BRS Working President @KTRBRS speaking to media after visiting Peddapur Gurukul student's family https://t.co/UGiXy9lat3

— BRS Party (@BRSparty) August 12, 2024

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన ఎలమాడల అనిరుధ్‌ (11), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మొండి మోక్షిత్‌ గురుకులంలో ఆరోతరగతి చదువుతున్నారు. వీరిద్దరూ గురువారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో పీఈటీ వెళ్లగా.. కడుపు నొప్పిగా ఉందని అనిరుధ్‌, మోక్షిత్‌లు తెలిపారు. దీంతో వెంటనే కేర్‌టేకర్‌లు, అనిరుధ్‌ తల్లికి ఫోన్‌లో సమాచారం ఇచ్చి వారిని కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అనంతరం విషమంగా ఉందని తెలపడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పతికి తీసుకెళ్లారు. అప్పటికే విషయం తెలిసి వైద్యుడు కూడా అయిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌.. విద్యార్థులు పాము కాటుకు గురై ఉండవచ్చని అందుకు తగిన వైద్యం చేయాలని ఆర్మూర్‌లో వైద్యులకు సూచించారు.

అక్కడ వైద్యం అందించి నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అనిరుధ్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాలలో ప్రార్థనా సమయంలోనే ఆరో తరగతి చదువుతున్న హేమంత్‌ అనే మరో విద్యార్థి కూడా కళ్లు తిరుగుతున్నాయని కింద పడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Read Also: Vinesh Phogat: వినేష్ బ‌రువు పెర‌గ‌టానికి ఈ రెండే కార‌ణ‌మా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anirudh family members
  • ktr

Related News

Revanth Harish

Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?

ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావు విసిరిన సవాల్ చర్చనీయాంశమైంది. తమ ఇలాకాలోకి అడుగుపెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అక్కడ హరీష్ రావు బలంగా ఉండటమే అందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు.

  • Ktr Ktr Manuu Land

    ‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

  • Fire Breaks Out At Hyderaba

    FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

    కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు – సీఎం రేవంత్

Latest News

  • తారిఖ్ రెహమాన్ యుగం.. భారత్ స్నేహమా లేక చైనా వైపు మొగ్గులా?

  • ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా.. నిబంధనల ఉల్లంఘనపై DGCA కఠిన చర్యలు!

  • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

  • లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!

  • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd