KTR : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నేత కార్మికలకు బీమా పథకం..!!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ వారాన్ని లేదా నెలను ఓ మంచి వార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు.
- Author : hashtagu
Date : 01-08-2022 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ వారాన్ని లేదా నెలను ఓ మంచి వార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం చేనేత, మరమగ్గం, కార్మికులందరికీ సరికొత్త బీమా సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమమని వెల్లడించారు కేటీఆర్.
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో నేత కార్మికులకు బీమా పథకం.
రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకం అమలు. ఈనెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రారంభం కానున్న ఈ పథకం.
దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు కలగనున్న లబ్ది.@KTRTRS pic.twitter.com/kenqV7TKOc
— BRS Party (@BRSparty) August 1, 2022