HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Target Cm Revanth

KTR Target : కేటీఆర్ టార్గెట్ రేవంతేనా..?

KTR Target : రేవంత్ ను తప్పిస్తే ఇక మనకు తిరుగుండదని భావిస్తున్నారా..? లేక కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కడే మొనగాడు..ఆయనను పార్టీ లో లేకుండా చేస్తే మనల్ని ఎవరు ఆపలేరని భవిస్తున్నారా..? అనేది అర్ధం కావడం లేదు

  • Author : Sudheer Date : 19-11-2024 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Target
Ktr Target

ప్రస్తుతం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) రాజకీయ వ్యవహార శైలి చూస్తే…ఆయన టార్గెట్ అంత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పైనే ఉన్నట్లు ఎవరికైనా అర్ధమవుతుంది. రేవంత్ ను తప్పిస్తే ఇక మనకు తిరుగుండదని భావిస్తున్నారా..? లేక కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కడే మొనగాడు..ఆయనను పార్టీ లో లేకుండా చేస్తే మనల్ని ఎవరు ఆపలేరని భవిస్తున్నారా..? అనేది అర్ధం కావడం లేదు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునే వరకు మొత్తం రేవంత్ పైనే కేటీఆర్ ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. తరుచు సోషల్ మీడియా వేదికగా చేసుకొని రేవంత్ పై విమర్శలు చేయడం , ఆరోపణలు కురిపించడం..రేవంత్ పై రాహుల్ కు పిర్యాదులు చేయడం ఇవన్నీ చేస్తుండడం చూసి ప్రతి ఒక్కరు కేటీఆర్ రేవంత్ కు భయపడుతున్నాడని భావిస్తున్నారు.

వాస్తవానికి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి వల్లే అని ఎవర్ని అడిగిన చెపుతారు. టీడీపీ పార్టీ లో కీలక నేతగా ఉండడం..చంద్రబాబు కు దగ్గరిగా ఉండే సరికి ప్రతి ఒక్కరు రేవంత్ కు అభిమానిగా మారిపోయారు. అలాగే రేవంత్ వాక్చాతుర్యము కూడా చాల బలంగా ఉంటుంది. ప్రత్యర్థి ఎంత పెద్దవాడైన..ఎంతటి ధీరుడైన సరే..రేవంత్ తన మాటలతో మాయ చేయడం..హెచ్చరించడం..గట్టిగ తన స్వరాన్ని వినిపించడం చేస్తుంటారు. ముఖ్యముగా కేసీఆర్ లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించడంటే..రేవంత్ వ్యాఖ్యలు ప్రజల్లోకి ఎంతగా వెళ్ళాయో అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే రాజకీయంగా రోజు రోజుకు ఆయనకు బలాన్ని పెంచుతున్నాయి. అలంటి బలం కాంగ్రెస్ లో లేకపోతే ఇక తిరుగుండదని కేటీఆర్ భావిస్తున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు.

రేవంత్ ను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకుంటున్నారో లేకపోతే రేవంత్ లేకపోతే చాలు కాంగ్రెస్ తో అయినా దోస్తీకి సిద్దమని అంటున్నారో కానీ.. ఆయన రాజకీయం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గాంధీభవన్‌లో గాడ్సే వారసుడు అంటూ కేటీఆర్ తరచూ చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ కేటీఆర్‌కు పవిత్రంగానే కనిపిస్తోంది. కానీ అందులో రేవంత్ మాత్రమే గాడ్సేలా కనిపిస్తున్నారు. ఆయనను తప్పించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి రేవంత్ వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని రాహుల్ కు ట్యాగ్ చేసి చెబుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ కు లాభమో.. నష్టమో రాహుల్‌కు తెలియదా… కేటీఆర్ చెప్పాలా ? అనుకునే వారు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది సీనియర్స్ కూడా కేటీఆర్ కు వెనుకనుండి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. రేవంత్ అంటే పడని వారు కాంగ్రెస్ లో చాలామందే ఉన్నారు. కాకపోతే వీరంతా బయటకు రేవంత్ మా వాడే అన్నట్లు ఉన్న..వెనుకాల మాత్రం రేవంత్ ను తప్పించాలని , అసలు కాంగ్రెస్ లో లేకుండా చేయాలనీ భావించే వారు లేకపోలేదు. అందుకే రోజు రోజుకు కేటీఆర్..రేవంత్ పై తన స్వరాన్ని పెంచుకుంటూ పోతున్నాడని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను తప్పిస్తుందా..? అంత సాహసం చేస్తుందా..? కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటుందా..? అనేది చూడాలి.

Read Also : Hydrogen Engines : ఇక విమానాల కోసం ‘హైడ్రోజన్‌’ ఇంజిన్లు.. రెడీ చేస్తున్న సైంటిస్టులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress party
  • KTR Target
  • rahul

Related News

Good News To Women

Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు

  • Errabelli Dayakar Rao

    కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

  • Cm Revant Good News

    Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd