HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Summoned By Acb On January 6

Formula E-Race Case : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

Formula E-Race Case : తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది

  • By Sudheer Published Date - 07:56 PM, Fri - 3 January 25
  • daily-hunt
Ktr
Ktr

ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసు(Formula E-Race Case)లో ఈనెల 6న విచారణకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు ఏసీబీ నోటీసులు (ACB Notice) జారీ చేసింది. తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధుల బదిలీ, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా జరిగిన లావాదేవీలపై ఏసీబీ ప్రశ్నించనుంది. కేటీఆర్‌ను ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

High Blood Pressure : మీకు హైబీపీ ఉందా..? అయితే ఈ ఆహారం అస్సలు తినొద్దు..!

ఏసీబీ కేటీఆర్‌ను ప్రశ్నించనున్న విషయాల్లో ముఖ్యంగా నిధుల బదిలీకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు..? మంత్రి వర్గం అనుమతి తీసుకోకపోవడానికి గల కారణాలు..? రేసింగ్ నిర్వహణలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి..? వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది. ఈ కేసు పూర్వాపరాలపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. ఫార్ములా-ఈ కేసులో మరో కీలక సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ నెల 7వ తేదీన కేటీఆర్‌ను ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఈడీ, ఏసీబీ కలిసి పని చేస్తున్నట్లు సమాచారం. విదేశీ నిధుల బదిలీపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. తనపై నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది. తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయకూడదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

ప్రస్తుతం ఫార్ములా-ఈ కేసు కారణంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ కేసును ప్రతిపక్ష పార్టీలు కావాలని రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Notice
  • Formula-E case
  • ktr

Related News

    Latest News

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?

    • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

    • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

    • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

    Trending News

      • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

      • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

      • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

      • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd