HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Slams Congress Over Governance And Mla Attack

KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు

KTR : కాంగ్రెస్‌ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.

  • Author : Kavya Krishna Date : 22-01-2025 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR To ED
KTR To ED

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కాంగ్రెస్‌ పాలనను సవాలక్ష సార్లు విమర్శిస్తూ ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ అసమర్థతను ఎత్తిచూపారు. కాంగ్రెస్‌ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.

దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, పోలీసులు భూపాల్ రెడ్డినే అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయికి దిగజారాయో చూపించిందని కేటీఆర్ మండిపడ్డారు. తమ నాయకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన డిమాండ్ చేశారు.

 White Pepper Vs Black Pepper : నల్ల, తెల్ల మిరియాల్లో వంట, ఆరోగ్యానికి ఏది మంచిది?

కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌ క్రైమ్ సిటీగా

కాంగ్రెస్‌ నిర్లక్ష్యపు పాలన వల్ల హైదరాబాద్‌ క్రైమ్‌ సిటీగా మారిపోయిందని కేటీఆర్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ పాలన గందరగోళంలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంచెలు వేసి రక్షించిన ప్రభుత్వ పార్కులు ఇప్పుడు రక్షణ లేకుండా పోయాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో నగర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి తలసాని నివాసంలో జరిగిన సమావేశంలో, నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్‌ ఆరోపించారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్‌ సర్కారుకు నగర ప్రజలు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై దాడి, నగర అభివృద్ధి సమస్యలపై కాంగ్రెస్‌ పాలన నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి దిశగా నడిపేందుకు బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Hindusim : హిందూమతం యొక్క 7 అత్యంత శక్తివంతమైన చిహ్నాలు, వాటి విధులు ఏమిటి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhupal Reddy Attack
  • brs
  • Congress Governance
  • hyderabad crime
  • Hyderabad Development
  • ktr
  • telangana politics

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • 20 Years of Revanth Reddy's Political Journey

    Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd