Rave Party : జన్వాడ రేవ్ పార్టీపై కేటీఆర్ సమాధానం చెప్పాలి – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Rave Party : రాజ్ పాకాల ఇప్పటి వరకు ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు
- By Sudheer Published Date - 02:50 PM, Sun - 27 October 24

హైదరాబాద్ శివారు జన్వాడలో జరిగిన రేవ్ పార్టీ జరగడం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.. పార్టీలో పాల్గొన్న వాళ్లలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. రాజ్ పాకాలకు చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీకి 35 మంది హాజరయ్యారు. ఈ పార్టీపై పోలీసులకు నిన్న రాత్రి ఫిర్యాదు అందడంతో.. నార్సింగి పోలీసులు, సైబరాబాద్ SOT బృందాలతోపాటు ఎక్సైజ్ పోలీసులు ఫామ్‌హౌస్‌కి వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ హై ఫై పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టు చేస్తే.. విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
రేవ్ పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం, గేమింగ్ కాయిన్స్, క్యాసినో మెటీరియల్ గుర్తించారు.. రాజ్‌పాకాలపై NDPS, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై బిజెపి , కాంగ్రెస్ పార్టీల నేతలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బిజెపి నేతలు స్పందించగా..తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) పై తీవ్రమైన విమర్శలు చేశారు. డ్రగ్స్ కల్చర్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆయన బావమరిది రాజ్ పాకాల డ్రగ్స్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు.
జన్వాడ ఫామ్‌హౌస్ (Janwada Farm House)లో జరిగిన రేవ్ పార్టీపై కేటీఆర్ (KTR) ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సొంత బావమరది రాజ్ పాకాల (Raj Pakala) డ్రగ్స్ వ్యాపారం (Drugs Business)లో ఉన్నారంటూ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ పాకాల ఇప్పటి వరకు ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు ఈ కేసులో సమగ్ర విచారణను చేపట్టి.. రేవ్ పార్టీ (Rave Party)కి హాజరైన వారందరినీ అరెస్ట్ చేయాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.
Read Also : Actress Suhasini : సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు : సుహాసిని