KTR : ప్రజలకు మద్దతుగా వెళ్తే.. మా నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? – కేటీఆర్
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం
- By Sudheer Published Date - 07:14 PM, Mon - 8 July 24

సోమవారం పీర్జాదిగూడ (Peerzadiguda ) నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చి వేత ను బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకోవడంతో వారిని అరెస్ట్ చేసారు పోలీసులు. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలకు మద్దతుగా వెళ్తే.. మా నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? అని ప్రశ్నించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణ పురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్ ఓనర్స్ కు మేలు చేయడం జరిగిందని, కానీ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇండ్లను కూల్చివేస్తోందన్నారు. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారని, మేము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం. ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్‌వోసీ జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈ రోజు కూలగొట్టించాడు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రి @revanth_anumula గారు,
మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేపించండి. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్… https://t.co/rXxgg6JpkP
— KTR (@KTRBRS) July 8, 2024