HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Ready For Another Fight Against The Central Government

KTR: కేంద్రంపై మరో పోరుకు సిద్ధమైన కేటీఆర్!

తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) కేంద్రంపై మరో పోరుకు సిద్ధమయ్యారు.

  • Author : Balu J Date : 22-12-2022 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR, bjp govt
Ktr And Modi

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు (Farmers) నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆరోపించారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ కల్లాల నిర్మాణాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. ఇంత మంచి కార్యక్రమం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, రాష్ట్రం పైన అసత్య ప్రచారం చేస్తున్నందుకు రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇప్పటికే పదుల సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశామన్నారు. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కనపెట్టి మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిందన్నారు కేటీఆర్(KTR). గ్రామాలలో కొవిడ్ కష్టకాలం తర్వతా ఉపాది అవకాశాలు తగ్గాయని, గ్రామీణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు. మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రైతులు కట్టుకున్న వ్యవసాయ కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గం అని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే… మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని విమర్శించారు. తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదే తరహా సిమెంట్ కల్లాలను ఉపాధి హామీ పథకంలో భాగంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసినా పట్టించుకోవడంలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు. కేవలం తెలంగాణ మీద వివక్షతోనే పనికిమాలిన షరతులను మోడీ సర్కారు తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. ఇందులో భాగంగా 750 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న 79000 వ్యవసాయ కల్లాల నిర్మాణాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఉపాధి హామీ పనులతో రైతులు ఉపయోగం జరిగితే తప్పా..? అని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.

వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని కేటీఆర్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకి నేరుగా డబ్బులు అందించే రైతు బంధు కార్యక్రమం తో మొదలుకొని రైతు బీమా, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. వ్యవసాయ (Agriculture) రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధి హామీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్న తమ ప్రభుత్వ సదుద్దేశానికి మోడీ ప్రభుత్వం దురుద్దేశాలు ఆపాదిస్తుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ప్రగతి పైన ఉన్న గుడ్డి వ్యతిరేకతతో కేంద్రం కక్ష కట్టిందన్నారు. వ్యవసాయ రంగ అనుబంధ పనులకు ఉపాధి హామీ నిధులను (NREGS) ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్ర రైతులపై కక్ష సాధించేందుకు మాత్రమే నిధులు మళ్లింపు అంటూ మోడీ సర్కారు దుష్ప్రచారం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయంఅన్నట్టుగా కేంద్రం తీరు..ఉందన్నారు.

మన రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా!! అన్న కేటీఆర్, మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన బీజేపీ (BJP Govt) కేంద్ర ప్రభుత్వం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని మరో కుట్రకు తెర లేపిందన్ననారు. తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడం ఇదేనా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణం కి ఖర్చయిన 151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కేటీఆర్ (KTR) కోరారు.

Govt has been allocating less money to MNREGA despite overshooting targets👇🏾It allocated ₹73,000 crore in 2021-22 but ended up spending ₹98,000 crore. For this year, govt budgeted ₹73,000 crore but has now sought Parliament approval for an additional ₹16,400 crore @livemint pic.twitter.com/PsvLzYIFHK

— Seema Chishti (@seemay) December 22, 2022

Also Read: Modi High-Level Meeting: కరోనా డేంజర్ బెల్స్.. మోడీ హైలెవల్ మీటింగ్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central governament
  • paddy farmers
  • pm modi
  • telangana

Related News

CM Revanth Leadership

సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

"పల్లెల్లో కేసీఆర్ హవా ఉంది.. ఎన్నికలు పెడితే చూపిస్తాం" అన్న బీఆర్ఎస్ సవాల్‌ను రేవంత్ సర్కార్ పటాపంచలు చేసింది. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Latest News

  • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

  • భారత్‌లోని ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ట్రూకాలర్‌ కొత్త ఫీచర్‌

  • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

  • నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

  • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd