HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Reaction To Acb Notice

ACB Notice to KTR : ఏసీబీ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావు గరం గరం

ACB Notice to KTR : ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాల ఫలమని అన్నారు

  • Author : Sudheer Date : 13-06-2025 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
There is nothing wrong with writing a letter to the party leader..internal matters..should be discussed internally: KTR
There is nothing wrong with writing a letter to the party leader..internal matters..should be discussed internally: KTR

తెలంగాణలో ఫార్ములా ఈ రేస్‌(Formula E-Car Race Case)కు సంబంధించిన నిధుల ఖర్చు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు ఏసీబీ నోటీసులు (ACB Notice) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరుతూ నోటీసులు పంపారు. ఈ నోటీసు పై స్పందించిన కేటీఆర్, తన పాలన దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా విమర్శల నుండి తప్పించుకోవాలనే కుతంత్రంలో సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారని మండిపడ్డారు. గతంలో ఫార్ములా ఈ సంస్థకు హెచ్ఎండిఏ ఖాతా నుంచి పారదర్శకంగా 44 కోట్లు పంపామని అవి ఇప్పటికీ ఆ సంస్థ ఖాతాలోనే ఉన్నాయని, కానీ వాటిని వెనక్కి రప్పించలేని తన వైఫల్యాన్ని దాచేందుకు రేవంత్ ఇటువంటి రాజకీయ నాటకాలు చేస్తున్నాడన్నారు.

CM Revanth: ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య‌.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

తనకు ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా, విచారణలు నిర్వహించినా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా నోటుకు ఓటు కేసులో నల్లబ్యాగుతో పట్టుబడిన సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఏసీబీ విచారణ పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఇద్దరిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని, రేవంత్ రెడ్డిని కూడా అదే పరీక్ష ఎదుర్కొనాలని సవాల్ విసిరారు. ప్రజల ముందే నిజం ఏంటో తేల్చాలని అన్నారు.

Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్‌బాక్స్‌ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు విచారణల పేరుతో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాల ఫలమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును మంటగలిపిన నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే తప్ప క్రైం చేసిందేమీ లేదని హరీష్ రావు తేల్చిచెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Notice to KTR
  • Formula E Car Race Case
  • harish rao
  • ktr

Related News

Ktrslbc

SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది. సొరంగం పనులను పర్యవేక్షించడంలో విఫలమవడమే కాకుండా, సహాయక చర్యల్లో జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    Trending News

      • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

      • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd